రాష్ట్రీయం

సామాన్యులకూ శాస్త్ర ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని ఐటి పురపాలక మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. తార్నాకలోని ఐఐసీటీలో తెలంగాణ అకాడమి ఆఫ్ సైన్స్ యువ శాస్తవ్రేత్తలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువ శాస్తవ్రేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అధికంగా జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందాలని, శాస్తవ్రేత్తల పరిశోధనలు వ్యవసాయ రంగానికి ఎంతో అవసరమని చెప్పారు. హైదరాబాద్‌ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని, ఇస్రో వంద ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపడం ఎంతో గర్వకారణమైన విషయమని పేర్కొంటూ శాస్తవ్రేత్తల కృషిని అభినందించారు. దేశాభివృద్ధికి శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన తెలిపారు.