రాష్ట్రీయం

సీబీఐ వలలో సీనియర్ రైల్వే అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: రైల్వే శాఖకు చెందిన ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్‌ఐటీఈఎస్)’ సికింద్రాబాద్ ప్రాజెక్టు ఆఫీస్ గ్రూప్ జనరల్ మేనేజర్ (సివిల్) కె.వెంకటేశ్వరరావు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్‌హేండెడ్‌గా చిక్కా రు. రూ.1.50 కోట్ల పెండింగ్ బిల్లు చెల్లించేందుకు రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా సీబీఐకి దొరికిపోయారు. లం చం తీసుకున్న రైల్వే అధికారి వెంకటేశ్వరరావుతో పాటు లంచం ఇచ్చేందుకు నగదుతో వచ్చిన నిర్మా ణ కంపెనీ మేనేజర్ శంకర్‌ను కూడా సిబిఐ అరె స్టు చేసింది. సీబీఐకి చిక్కగానే నిందితుడికి చెం దిన కొంపెల్లిలోని నివాసం, సికింద్రాబాద్‌లోని కా ర్యాలయం, మరికొన్ని చోట్ల ఏకకాలంలో సోదా నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం (ఎసీబీ) సూపరింటెండెంట్ కార్యాలయం తెలిపిం ది. రైల్వే అధికారి వెంకటేశ్వరరావు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడుతూ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నట్లు సీబీఐకి సమాచారం అందింది. ఈ క్రమంలో తమిళనాడు కు చెందిన కెవిఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ. 11 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఆ ప్రా జెక్టులో భాగంగా పెండింగ్‌లో ఉన్న రూ.1.50 కోట్ల విలువైన బిల్లును క్లియర్ చేసేందుకు రూ.15 లక్షలు వెంకటేశ్వరరావు లంచం ఆశించారు. ఈ మొత్తం చెల్లించేందుకు కేవీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యజమాని ఎం.రాజ్‌కుమార్ తన వద్ద పనిచేసే ప్రాజెక్టు మేనేజర్ శంకర్ కు డబ్బులిచ్చి పంపించారు. శంకర్ రైల్వే అధికారి వెంకటేశ్వరరావుకు డబ్బు అందజేస్తుండగా పక్కా ప్రణాళిక తో సిబిఐ ఎసిబి విభాగం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు లంచం సొమ్ము ఇస్తున్న శంకర్‌ను అరెస్టు చేసి, హోటల్ గదిలో సోదా నిర్వహించారు. దీంతో పాటు రైల్వే అధికారి నివాసం, కార్యాలయంలో సోదాలు చేసి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చే సుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. నిందితులిద్దరినీ సీబీఐ న్యాయస్థానంలో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది.