రాష్ట్రీయం

తిరుమలలో స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసేందుకు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన బూందీ పోటులో శనివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బూందీ తయారు చేసే సమయంలో బాండలి నుంచి మంటలు ఎగసిపడి పైనున్న నెయ్యి బూజుకు అంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోటు సిబ్బంది ముందు మంటలు ఆపే ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరకుని మంటలను సిబ్బంది అదుపుచేశారు. అయితే మంటలు వ్యాపించే సమయంలో దట్టమైన పొగ ఎగ్జాస్టర్ నుంచి వెలుపలికి రావడంతో భక్తులు భయాందోళనలకు గురైయ్యారు. సమాచారం తెలుసుకున్న జే ఈ ఓ శ్రీనివాసరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటులో చిన్న అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అయితే వెంటనే మంటలను అదుపు చేశామని, గంట వ్యవధిలోనే బూందీ తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. పోటులో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎప్పటి కప్పుడు ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నివారణా చర్యలు చేపడుతున్నామన్నారు. పోటు కార్మికులు కూడా మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని, ఆదిశగా వారిని చైతన్య పరుస్తామన్నారు.