రాష్ట్రీయం

వైభవంగా బుద్ధ జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏఫ్రిల్ 29: నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వత ఆరామా బుద్ధవనంలో ఆదివారం నాడు బుద్ధ పూర్ణిమ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2,562 బుద్ధజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుద్ధజయంతి ఉత్సవాల్లో భాగంగా బుద్ధవనంలో మొదటగా బుద్ధచరితవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మహాస్థూప లోపలి భాగంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బుద్ధవిగ్రహాం వద్ద వివిధ బౌద్ధ ప్రాంతాల నుండి వచ్చిన బౌద్ధ గురువులు, బౌద్ధ బిక్షవులు ప్రత్యేకమైన ప్రార్థనలు బౌద్ధ ప్రవచనాలు చదువుతూ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బుద్ధవిగ్రహం వద్ద జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నిపుణులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ బౌద్ధంవైపే చూస్తున్నాయని బుద్ధుడు ప్రబోధించిన అహింస, శాంతివైపే ఆసక్తి చూపుతున్నాయన్నారు. బౌద్ధ ప్రాంతాలను సందర్శించినపుడు మనసు శాంతితో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. బుద్ధవనం అంతార్జాతీయ స్థాయిలో మరింత ప్రఖ్యాతి సంపాందించే విధంగా రూపుదిద్ధుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్‌డీ సుధాన్‌రెడ్డి, తెలంగాణ టూరిజం హోటల్స్ జనరల్ మేనేజర్ జోయల్, ఎస్‌ఈ క్రాం తిబాబు, ఏఈ జగదీశ్‌కుమార్, బుద్ధవనం శిల్పాల ఇన్‌చార్జి శ్యాంసుందర్, టీఆర్‌ఎస్ నాయకులు బ్ర హ్మారెడ్డి, ప్రొఫెసర్లు పరం ఆనంద్, డాక్టర్ శ్రీకాంత్, డా. సంతోష్, మంగేష్, దైవాలి, బుద్ధవనం సెక్యూరిటీ సుపర్‌వైజర్ విశ్వనాధశాస్ర్తీ పాల్గొన్నారు.

చిత్రం..బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న బౌద్ధ భిక్షువులు, అధికారులు