రాష్ట్రీయం

కల్లు.. మా జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ‘కల్లు..మా తల్లిలాంటిది. 40 ఏళ్లుగా మా కుటుంబానికి అదే జీవనాధారం’గా ఉంటోంది. అన్నాడు 70 ఏళ్ల వయస్సున్న చంద్రయ్య గౌడ్. ‘నాకు ముగ్గురు పిల్లలు. వారి పెళ్లిళ్లు కూడా చేశాను. రోజువారీ ఖర్చులు.. పెళ్లిళ్ల ఖర్చులు అన్నీ కల్లు తల్లే సమకూరుస్తోందంటూ ఆంధ్రభూమి ప్రతినిధితో అనందంగా చెప్పాడు.
రంగారెడ్డి జిల్లా జిల్లెల్లగూడ గ్రామానికి చెందిన చంద్రయ్యతో పాటు అతడి ఇద్దరు తమ్ముళ్లు కూడా కల్లుపైనే గత నాలుగు దశాబ్దాలుగా జీవిస్తున్నారు. నేడు ఉద్యోగం రాలేదని బాధపడుతున్న యువతకు చంద్రయ్య అతడి తమ్ముళ్లు ఆదర్శంగా ఉంటారని చెప్పుకోవచ్చు. డిగ్రీలు, పీజీలు చదివిన యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేట్ రంగంలో మంచి జీతం వచ్చే ఉద్యోగమో రావాలని ఆశిస్తున్నారు..తప్ప స్వయం ఉపాధి కోసం ప్రయత్నించడం లేదు. స్వయం ఉపాధికి ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వాడుకోవడం లేదు. మంచి ఉద్యోగం లేకపోతే జీవించలేము అన్న మానసిక దురవస్థలో చాలా మంది యువతీ, యువకులు కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారికి చంద్రయ్యగౌడ్ లాంటి వాళ్లు ఆదర్శంగా ఉంటారనడంలో సందేహం లేదు. మన సమాజంలో వంద మందిలో ఒక్కరంటే ఒక్కరు మాత్రమే సర్కారు ఉద్యోగంలో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. 60 శాతంపైగా మంది స్వయం ఉపాధిపైనే జీవిస్తున్నారు. ఇతరులు కూలీనాలీ పనులు చేసుకుంటూ పొట్టనింపుకుంటున్నారు. చదువుకున్న యువత ఈ వాస్తవాలను గమనించాలని నిపుణులు చెబుతున్నారు.
చంద్రయ్యగౌడ్‌తో పాటు అతని తమ్ముళ్లు కల్లుగీయడం, అమ్ముకోవడం అనే స్వయం ఉపాధినే నమ్ముకుని స్వేచ్ఛగా జీవిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కల్లుఅమ్మే గీతకార్మికులు వేల సంఖ్యలో కనిపిస్తుంటారు. చంద్రయ్యగౌడ్ లాంటి వారికి కల్లు సొసైటీలతో ఎలాంటి సంబంధం లేదు. ‘గీతకార్మికుడికి కల్లు చెట్టు’ (ట్రీ ఫర్ ట్యాపర్-టీఎఫ్‌టీ) పథకం కింద జీవనం సాగిస్తున్నారు. ‘నాకు 12 కల్లు చెట్లు (తాటి, ఈత తదితరాలు), మా ఇద్దరు తమ్ముళ్లకు పనె్నండేసి కల్లు చెట్లు ఉన్నాయి. రోజూ కల్లుతీయడం, అమ్మడం వల్ల 500 నుండి 800 రూపాయల వరకు లభిస్తున్నాయన్నారు. 20 ఏళ్ల కింద మా ఊరంతా పచ్చని పంటపొలాలతో ఉండేది. రైతులు పంట పొలాలకు నీళ్లు పెడుతుండటంతో కల్లు చెట్లకు తగినంత నీరు లభించి రోజూ ఒక్కో చెట్టు నుండి 10 నుండి 20 లీటర్ల కల్లు వచ్చేదన్నారు. ఇప్పుడు పంట పొలాల స్థానంలో గృహాలు (కాలనీలు) వచ్చేశాయి. దాంతో కల్లు చెట్లకు నీళ్లు లేకపోవడంతో కల్లు ఉత్పత్తి సగానికి తగ్గిపోయిందని వాపోయాడు. ఆదా యం తగ్గినా కులవృత్తిని విడిచేది లేదని తెగేసి చెప్పారు చంద్రయ్యగౌడ్ అతని తమ్ముళ్లు. కల్తీలేని కల్లు అమ్మడమే మాకు అలవాటన్నారు. కల్లు చెట్లపై పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. చెట్లపైనుండి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోతే గతంలో రెండులక్షల రూపాయలు, అంగవైకల్యం కలిగితే 50 వేల రూపాయలు సర్కారు ఇచ్చేదని, ఈ నష్టపరిహారాన్ని కేసీఆర్ ఐదులక్షల రూపాయలకు పెంచడం తమకు సంతోషంగా ఉందన్నారు. చంద్రయ్యగౌడ్ లాంటి టీఎఫ్‌టీ గీతకార్మికులు రాష్ట్రంలో 30 వేలపైగా ఉన్నారు. సొసైటీలను ఏర్పాటు చేసుకుని మరికొన్ని వేల మంది జీవిస్తున్నారు.