రాష్ట్రీయం

గుల్బర్గా -హైదరాబాద్ ఇంటర్ సిటీ రైలు వేళలు మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 29: ప్రతి రోజు సాయంత్రం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరుతున్న గుల్బర్గా - హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8.30 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. ఈ సమయం హైదరాబాద్ నుంచి తాండూరు మీదుగా గుల్బర్గా వరకు వెళ్లే ప్రయాణీకులకు అనుకూలంగా ఉంది. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గుల్బర్గా నుంచి తిరుగు ప్రయాణ సమయం అనుకూటంగా లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రతి రోజు రాత్రి 6.30 గంటలకు గుల్బర్గాకు చేరుకునే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు గుల్బర్గా నుంచి బయలు దేరి మధ్యాహ్నాం 3గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకోవటంతో చాలా సమయం లుస్‌టైం అవుతుంది. ఇంటర్ సిటీ రైలు గుల్బర్గా నుంచి రోజు ఉదయం 6గంటలకు బయలుదేరే విధంగా రైలు ప్రయాణ సమయం మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు గుల్బర్గాలో ఇంటర్ సిటీ రైలు బయలు దేరితే తాండూరుకు ఉదయం 8.30 గంటలకు చేరుతుందని, తద్వారా హైదరాబాద్ వైపు వచ్చే ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులకు సమయం అనుకూలం అని తాండూరు ప్రయాణికులు వెల్లడిస్తున్నారు. ప్రసుత్తం ఉదయం 10.15 గంటలకు గుల్బర్గా నుంచి బయలు దేరుతున్న ఇంటర్ సిటీ రైలు తాండూరుకు మధ్యాహ్నాం 12గంటలకు చేరుకుంటుంది. తాండూరు నుంచి హైద్రాబాద్ వరకు ప్రయాణించే అన్ని వర్గాల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరటం లేదన్న వాదనలు ప్రయాణీకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్‌ను శంకర్ పల్లి రైల్వేస్టేన్‌లో నిలపాలని తద్వారా శంకర్ పల్లి పరిసర ప్రాంతాలకు వెళ్లే అన్ని వర్గాల ప్రయాణికులకు ప్రయోజనం కలుగితుందని ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే అధికారులు, జీ.ఎం వినోద్ కుమార్ యాదవ్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ సిటీ రైలు ప్రయాణ వేళలు మార్చితే రైల్వే ఆదాయం పెరగడంతోపాటు, హైదరాబాద్ వైపు ప్రయాణించే ప్రయాణీకులకు ఉదయం వేళ పనులకు అనుకూలం అని వాదనలు ప్రయాణికుల నుండి వినపడుతున్నాయి.
ప్రతి రోజు ఉదయం వేళ హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ నుంచి తాండూరు వరకు మరో లోకల్ రైలు ఏర్పాటు చేస్తామన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే జీ.ఎం హామీ బుట్టదాఖాలు అయిందని తాండూరు ప్రాంతం రైలు ప్రయాణీకులు వాపోతున్నారు. ప్రయాణీకుల తాకిడి, రైల్వే ఆదాయం అంతగా లేని స్టేషన్‌కలు అనవసర వేళల్లో రైళ్లను ఏర్పాటు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికార యంత్రాంగం భారీ స్థాయిలో రైల్వే ఆదాయం కలిగి ఉన్న తాండూరు రైల్వే స్టేషన్ ప్రాంతానికి రైల్లు సక్రమంగా నడపటంలో ఘోరంగా విఫలం అవుతున్నట్లు రైల్వే ప్రయాణికుల సంఘం, రైల్వే పాస్ ఓల్డర్స్ అసోసియేషన్ ప్రతి నిధులు విమర్శిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం వేళల్లో హైదరాబాద్ వైపు నుంచి తాండూరుకు రైలు సైతం అందుబాటులో లేదు. నిత్యం ఉదయం ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ మీదుగా గుల్బర్గా వరకు ప్రయాణించే ఓక్క రైలు ఉందని, ఆ రైలులో ప్రయాణం నరక ప్రాయంగా మారిందని, ప్రతి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి తాండూరు వైపు ప్రయాణించే వారికి ఆ ఓక్క రైలే దిక్కుగా ఉందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.