రాష్ట్రీయం

రాక్షసులు రాజసూయ యాగం చేస్తున్నట్టుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటం చూస్తుంటే, రాక్షసులు రాజసూయ యాగం చేస్తున్నట్టుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. అలాగే సీతకోసం వెతుకుతున్న రాముడికి రావణుడు సహకరించినట్టుందని ఆయన విమర్శించారు. విశాఖలో వైసీపీ నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్షలో భూమన మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో ఎవరైనా హోదా పేరెత్తితే అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబుకు ఇప్పుడు హోదా గొప్పతనం గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల కిందట సరిగ్గా ఇదే రోజున తిరుపతిలో చంద్రబాబు మాట్లాడుతూ హోదా 15 సంవత్సరాలు కావాలని కోరారని, నాలుగేళ్లపాటు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి, ఇప్పుడు హోదా కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని, వారిని ఎన్నిసార్లయినా మోసం చేయచ్చన్నది చంద్రబాబు భావన అని భూమన అన్నారు. వెంకటేశ్వరుని పాదాల వద్ద పదే పదే మోసాలు చేస్తూ, ఆ దేవుడ్ని కూడా చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఇక భరించే స్థితిలో లేరని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ప్రధాని మట్టీ, నీరు ఇస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదని మంత్రి దేవినేని ఉమ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ మట్టి, నీటినే చంద్రబాబు తీసుకున్నప్పుడు అక్కడే ఉన్న దేవినేని ఎందుకు అడ్డుకోలేదని రోజా ప్రశ్నించారు. అదేదో పవిత్ర జలంలా హెలికాప్టర్‌లో రాజధాని ప్రాంతంలో చల్లుతూ ఉంటే, మంత్రులంతా కళ్ళప్పగించుకుని చూస్తూ కూర్చున్నారని ఆయన అన్నారు. 2014 ఏప్రిల్ 30న తిరుపతిలో జరిగిన సభలో రాష్ట్రానికి 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలపాటు ఆ మాటను మరిచిపోయి, ఇప్పుడు నిద్రలేచి హోదా కోసం పరుగులు తీయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు మాట్లాడితే కుట్ర రాజకీయాలని అంటున్నారని, చంద్రబాబును వెన్నుపోటు పొడిచినప్పుడు అది కుట్ర అన్న విషయం బాబుకు తెలియదా? అని రోజా ప్రశ్నించారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరిగితే చాలని భావించిన చంద్రబాబు హోదాను పక్కన పెట్టేశారని అన్నారు. జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్నారని, సోనియాతో మంతనాలు సాగించారని ఆమె అన్నారు. జగన్‌ను పదే పదే నేరగాడని చంద్రబాబు అంటున్నారని, జగన్ తప్పు చేయలేదు కాబట్టే, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారని, చంద్రబాబు, లోకేష్ తప్పులు చేశారు కాబట్టే, బీజేపీలో లాలూచీపడ్డారని విమర్శించారు.