రాష్ట్రీయం

రూ. 3 లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలో గడచిన నాలుగు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోచుకున్నారని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందులో 60 శాతం మొత్తాన్ని విదేశాలకు తరలించారని ఆయన చెప్పారు. విశాఖలో సోమవారం జరిగిన వంచన వ్యతిరేక దీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు కేవలం మాల్యాతోనే కాదు, హవాలా, ఆయుధాల డీలర్లతో కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటన్నింటికీ సంబంధించిన సాక్ష్యాధారాలు తనవద్ద ఉన్నాయని, త్వరలోనే ప్రధానికి వీటిని అందిస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. తనపై సీబీఐ విచారణ జరుగుతుందన్న భయంతో చంద్రబాబు వణికిపోతున్నారని, బయటకు కేంద్రాన్ని విమర్శిస్తూ, వారితో రహస్య మంతనాలు జరుపుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, కేంద్రం తనపై చర్యలకు దిగితే, తనకు అండగా ఉండాలని ప్రజల వద్ద ప్రాధేయపడి సానుభూతి సంపాదించాలని చూస్తున్న చంద్రబాబు ఇక ఆ పదవిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదని ఆయన అన్నారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు విలాసాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తను పదేపదే ప్రధాన మంత్రిని కలుస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. అవును., తను ఇక ముందు కూడా ప్రధానిని కలుస్తాను. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరడానికి మాత్రమే తను ప్రధానిని కలుస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీయే నుంచి వెలుపలికి వచ్చాక, చంద్రబాబు నాయుడు భయంతో వణికిపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు నేరాలను బయటపెట్టి, ఆయనను చట్టంముందు దోషిగా నిలబెడతామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు తిరుపతిలో ధర్మపోరాట సభ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చంద్రబాబుకు అసలు ధర్మమంటే తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.
కన్నబిడ్డలు, అల్లుడు
చేయలేని పని జగన్ చేశారు!
తను అధికారంలోకి వస్తే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ సోమవారం సంచలన ప్రకటన చేశారు. జగన్ ప్రకటనను వైసీపీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విశాఖలో జరుగుతున్న వంచన వ్యతిరేక దీక్ష సభలో సభికులకు తెలియచేశారు. దీంతో సభలో హర్షద్వానాలు మిన్నంటాయి. జగన్ ప్రకటనపై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ కన్న కొడుకులు, అల్లుడు చేయలేని పనిని ప్రతిపక్ష నాయకుడై ఉండి ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.