రాష్ట్రీయం

భగభగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణం యావత్తూ ఎండలతో అల్లాడుతోంది. అత్యధిక ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ పగటిపూట ఎండ తీవ్రత జన జీవనాన్ని ఇబ్బంది పెడుతోంది. మేలో ఎండలు మరింత మండుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరిస్తోంది. మేలో అత్యధిక ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఎప్పుడూ
లేనిది ఏప్రిల్ మాసం నుంచే వడదెబ్బలకు జనం గురవుతున్నారు. మేలో నమోదయ్యే అత్యధిక ఎండలతో మరింత ఇబ్బంది తప్పదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నప్పటికీ, ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. 42 డిగ్రీలకే రాజధాని ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో 43 డిగ్రీలు, 44 డిగ్రీలు కూడా నమోదవుతోంది. గత ఏడాది మేలో కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉషోణ్రగతలు నమోదవ్వడం తెలిసిందే. ఈ పర్యాయం కూడా అదేవిధమైన పరిస్థితి ఉంటుందని ఐఎండి అధికారులు అంటున్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయ. ఆదిలాబాద్ 44, భద్రాచలం 39, హకీంపేట 41, హన్మకొండ 41, హైదరాబాద్ 42, ఖమ్మం 40, మహబూబ్‌నగర్ 39, మెదక్ 43, నల్లగొండ 40, నిజామాబాద్ 44, రామగుండం 43 డిగ్రీల సెల్సియస్ ఉషోణ్రగతలు నమోదయ్యాయ.