రాష్ట్రీయం

టాపర్ సూరజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: జాతీయస్థాయి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ఐఐటి జెఇఇ మెయిన్ పరీక్ష ఫలితాలను సీబీఎస్‌ఈ సోమవారం రాత్రి విడుదల చేసింది. జాతీయస్థాయిలో ఆంధ్ర విధ్యార్థి బోగి సూరజ్ కృష్ణ టాపర్‌గా నిలిచాడు. తెలుగు రాష్ట్రాల విద్యారులూ ఫలితాల్లో దుమ్మురేపారు. తొలి 20 జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి ఏడుగురు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. జెఇఇ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. తొలి దశలో మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో కటాఫ్ అర్హత మార్కులు సాధించిన వారికి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ప్రాతిపదికపై అభ్యర్ధులకు ఐఐటిల్లో సీట్లు కేటాయిస్తారు. మెయిన్స్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి)లతో సహా జాతీయస్థాయి ఖ్యాతిగడించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు దక్కుతాయి. మెయిన్ పరీక్షను 360 మార్కులకు నిర్వహించగా గట్టు సూరజ్ కృష్ణకు 350 మార్కులు లభించాయి. 350 మార్కులు సాధించిన వైజాగ్ విద్యార్థి కేవీఆర్ హేమంత్ చోడిపిల్లి కేటగిరిలో టాపర్‌గా నిలిచాడు. జనరల్ లిస్టులో రెండోస్థానం దక్కింది. పార్థా లతూరియా(రాజస్థాన్) కు మూడో స్థానం లభించగా, చంఢీఘడ్‌కు చెందిన ప్రణవ్ గోయల్‌కు నాలుగో స్థానం, ఆంధ్రాకు చెందిన గట్టు మైత్రేయికి ఐదో స్థాం లభించాయి.
టాప్ 20లో ఏడుగురు తెలుగు విద్యార్థులు టాప్ ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం. టాపర్ల జాబితాలో తొలి ఆరుగురికి 360 మార్కులకుగానూ 350 మార్కులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 10,43,739 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి ఆఫ్‌లైన్‌లో , ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. ఆఫ్ లైన్ పరీక్షను ఏప్రిల్ 8న, ఆన్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 15,16 తేదీల్లో నిర్వహించారు. ఇందుకోసం 112 నగరాల్లో 1613 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన వారిలో 6,46,814 మంది అబ్బాయిలు, 2,66,745 మంది అమ్మాయిలున్నారు. మరో ముగ్గురు ట్రాన్స్‌జండర్స్ పరీక్ష రాశారు. వీరిలో మెయిన్స్ నుండి 2,31,024 మంది అర్హత సాధించారు. అందులో జనరల్ లిస్టులో 1,11,275 మంది కాగా, ఒబిసిలు 65,313 మంది, ఎస్సీలు 34,425 మంది, ఎస్టీలు 17,256 మంది, పిడబ్ల్యుడి 2755 మంది ఉన్నారు. జనరల్ కేటగిరి టాపర్‌కు 350 మార్కులు రాగా, కటాఫ్ 74 మార్కులుగా నిర్ణయించారు. ఒబిసి కేటగిరి కటాఫ్ 45 మార్కులుగా నిర్ణయించారు. ఇక ఎస్సీ అభ్యర్థులు 29 దాటిన వారంతా అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. అలాగే ఎస్టీలు 24 మార్కులు దాటితే వారికి అర్హత దక్కింది.
టాపర్ల జాబితా
ర్యాంకు పేరు రాష్ట్రం
1 బోగి సూరజ్ కృష్ణ ఏపీ
2 కేవీఆర్ హేమంత్‌కుమార్ ఏపీ
3 పార్థలాతురియా రాజస్థాన్
4 ప్రణవ్ గోయల్ హర్యానా
5 గట్టు మైత్రేయ తెలంగాణ
6 పవన్ గోయల్ రాజస్థాన్
7 భాస్కర్ అరుణ్ గుప్త రాజస్థాన్
8 దాకరపు భారతి ఏపీ
9 సిమర్‌ప్రీత్ సింగ్ సలూజ ఢిల్లీ
10 గోసుల వినాయక శ్రీవర్ధన్ తెలంగాణ
11 నవనీల్ సింఘాల్ రాజస్థాన్
12 ఆయుష్ గార్గ్ హర్యానా
13 లే జైన్ రాజస్థాన్
14 జతోత్ శివ తరుణ్ తెలంగాణ
15 పి లోకేశ్వరరెడ్డి ఏపీ
16 కరణ్ అగర్వాల్ రాజస్థాన్
17 ఎ కుమార్ వర్మ బీహార్
18 అనిరుథ్ పాణిగ్రాహి ఢిల్లీ
19 యాష్‌గుప్త రాజస్థాన్
20 అనుభవ్ సైకియా రాజస్థాన్