రాష్ట్రీయం

గురజాడ మళ్ళీ పుట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 29: పూర్వకాలంలో కఠిన దురాచారాలతో మహిళలు తీవ్ర అవస్థలు గురయ్యేవారని, గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తల ప్రయత్నాలు, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా ఆ పరిస్థితులను రూపుమాపగలిగామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ మృణాళిని అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు శత వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరంలోని ఆయన స్వగృహంలో గురజాడ చిత్రపటానికి మంత్రి మృణాళిని, జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు, పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం కార్యక్రమానికి ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. ఆధునిక యుగంలో కూడా మహిళలపై అకృత్యాలు పెరగటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో గురజాడ వంటి వ్యక్తులు మళ్లీ పుట్టి సమాజంలోని కుళ్లును కడిగివేయాలని అనిపిస్తోందని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టాలు కూడా తీసుకువచ్చారని గుర్తుచేశారు. కానీ, ఇటీవల కాలంలో ఎక్కువ విద్యార్హతలు, ఎక్కువ ఆదాయం కూడా భార్యాభర్తల్లో, కుటుంబాల్లో చిచ్చు రేపుతోందని ఆందోళన చెందారు. గురజాడ, కందుకూరి వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని కుటుంబ, సమాజ హితం కోసం అందరు కృషి చేయాలని కోరారు.
పొంచివున్న ‘కన్యాశుల్కం’ ముప్పు: గరికపాటి
సమాజంలోని కుళ్లును కడిగేయటానికి ప్రతి వ్యక్తి గాంధీ, గురజాడ మళ్ళీ పుట్టాలని అంటున్నారే తప్ప, వారి ఆశయాలను తాము ఆచరించటానికి, తమ పిల్లలను ఉత్తములుగా తీర్చదిద్దటానికి ప్రయత్నించటం లేదని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి గరికపాటి ముఖ్య వక్తగా హాజరై, మాట్లాడారు. ఒకవేళ గాంధీ మహాత్ముడు, గురజాడ పొరపాటున మళ్లీ పుడితే సమాజంలో ప్రస్తుతం ఏర్పడిన అవలక్షణాలను గమనించి తాము కన్నకలలు ఈ మార్పు కోసమా అని మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అప్పట్లో కన్యాశుల్కం, ఆడపిల్లలకు బాల్యవివాహాలు వంటి నాటుకుపోయిన ఆచారాలపై తమ రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారని తెలిపారు. కానీ, ఇప్పుడు మరో రకంగా కన్యాశుల్కం వంటి దురాచారం వచ్చే ప్రమాదం ఏర్పడిందని, దీనిని రూపుమాపేందుకు మరో గురజాడ, కందుకూరి పుట్టడం అనుమానమేనని అన్నారు. మగపిల్లలపై తల్లిదండ్రులకు మోజు పెరగడం వలన ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నా వివాహాల సందర్భంగా భారీమొత్తంలో డబ్బు సంపాదించే వాడినే పెళ్లిచేసుకోవాలని, అత్తమామలు పోరు ఉండకూడదని, తల్లిందండ్రులు, అత్తమామలు పనికిరాని వస్తువలనే భావన వారిలో పెరిగిపోతోందన్నారు. మహానుభావులకు, సంఘ సంస్కర్తలకు విగ్రహాలు పెట్టి, దండలు వేసి వేడుకలు జరపటంతో సరిపెడుతున్నారని, వారి ఆశయాలను ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మాత్రం జరగటం లేదన్నారు.

విజయనగరంలో ఆదివారం జరిగిన గురజాడ శత వర్ధంతి సారస్వత నీరాజనం కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి మృణాళిని