రాష్ట్రీయం

21నుంచి ఇంటర్ అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూలును విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుండి విక్రయిస్తారు. మెరిట్ లిస్టులను తయారుచేసి వెంటనే జాబితాలను బహిరంగంగా ప్రకటిస్తారు. తరగతులు జూన్ 1 నుండి మొదలవుతాయి. తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్‌నెట్ ద్వారా పొందిన ఎస్సెస్సీ మార్కుల జాబితాలు ఆధారంగా తొలి దశ కౌనె్సలింగ్ నిర్వహించాలని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, ఇ గ్రూప్‌నకు 4 శాతం, పిహెచ్‌సికి 3 శాతం, ఎన్‌సిసి, స్పోర్ట్సుకు 5 శాతం, మాజీ సైనికుల పిల్లలకు 3 శాతం రిజర్వేషన్లతో పాటు అన్ని క్యాటగిరిల్లో మూడో వంతు సీట్లను బాలికలకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.