రాష్ట్రీయం

25 నుండి ఎమ్సెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలను ఈనెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం 18వ తేదీనే విడుదల చేయాల్సి ఉన్నా ఫలితాల నిర్వహణ బాధ్యతను తీసుకున్న ఏజన్సీ జాప్యంతో ఒక రోజు వాయిదా వేసినట్టు తెలిసింది. 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఎమ్సెట్ పరీక్షను నిర్వహించారు. అగ్రికల్చర్ స్ట్రీంకు 73078 మంది రిజిస్టర్ చేసుకోగా, 71,766 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,47,912 మంది రిజిస్టర్ చేసుకోగా 1,36,311 మంది హాజరయ్యారు.
25 నుండి కౌనె్సలింగ్
ఎమ్సెట్ కౌనె్సలింగ్‌ను ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 2 వరకూ నిర్వహించాలని శుక్రవారం నాడు జరిగిన సెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి అధ్యక్షత వహించగా, కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. 25వ తేదీ నుండి ఆన్‌లైన్ డాటా ఫిల్లింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తారు.
మే 28 నుండి ఆన్‌లైన్‌లోనే సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుంది. అదే రోజు నుండి జూన్ 5 వరకూ ర్యాంకుల వారీ వెబ్ ఆప్షన్లకు గడువు ఇస్తారు. ఆప్షన్లను జూన్ 5న ఫ్రీజ్ చేస్తారు. తొలి దశ సీట్ల కేటాయింపు జూన్ 8న జరుగుతుంది. సీట్లు పొందిన అభ్యర్ధులు జూన్ 8 నుండి 12లోగా ఫీజులు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదల చేస్తారు.