రాష్ట్రీయం

అగ్రికల్చర్ టాపర్ నమ్రత.. ఇంజనీరింగ్‌లో వంశీనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ ఎమ్సెట్ -2018 ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. తొలిసారి ఎమ్సెట్ పరీక్షను ఆన్‌లైన్‌లో ఈనెల 2 నుండి 7 వరకూ విజయవంతంగా నిర్వహించినందుకు జెఎన్‌టియు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ప్రభుత్వం గత నాలుగేళ్లలో విద్యారంగంలో చేపడుతున్న చర్యలువల్ల ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరిగిందన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ల్యాబ్ పరికరాలు, 75 శాతం తప్పనిసరి హాజరు ఉండాలన్న నిబంధనలతో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కు అధికారికంగా అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. ఒక కాలేజీలో ఒక కోర్సులో సీటు పోంది తర్వాత మారాలనుకుంటే అదే కాలేజీలో వేరే కోర్సులో సీటు ఖాళీగా ఉంటే మారవచ్చన్నారు. గతంలో ఇంటర్నల్ స్లైడింగ్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవారు కాదని, ఈ ఏడాది నుంచి వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,47,956 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా, 1,36,305 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో
1,06,646మంది అర్హత సాధించారని చెప్పారు. మొత్తంగా 78.24 శాతం మంది ఇంజనీరింగ్‌లో క్వాలిఫై అయ్యారన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 73,106 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 66,858 మంది పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 90.72 శాతం మంది అర్హత సాధించారన్నారు. జూన్ 8 నాటికి మొదటి దశ అడ్మిషన్లు పూర్తవుతాయని, జూలై మొదటివారంలో రెండో దశ అడ్మిషన్లు పూర్తవుతాయని అన్నారు. సాధారణంగా ప్రతి ఏటా తరగతులు ఆగస్టు మొదటి నుండి ప్రారంభమయ్యేవని, ఈసారి తాము 15 రోజులు ముందుకు జరిపి జూలై 16నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో మొదటి పది ర్యాంకర్ల పేర్లు ఉప ముఖ్యమంత్రి చదివి వినిపించారు.
ఎమ్సెట్ ర్యాంకు కార్డులు 22 నుండి సంబంధిత వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, జెఎన్‌టియుహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ యాదయ్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో తొలి పది ర్యాంకులు వరుసగా అయ్యపు వెంకట ఫణి వంశీనాథ్(రంగారెడ్డి), జి మైత్రేయ (రంగారెడ్డి), గోసుల వినయ్ శ్రీవర్ధన్ (రంగారెడ్డి), కేవీఆర్ హేమం కుమార్ చోడిపిల్లి (విశాఖ), సనికొమ్ము మదన్ మోహన్‌రెడ్డి (విజయవాడ), దాకారపు భరత్ (శ్రీకాకుళం), యాష్‌గార్గ్ (హైదరాబాద్), కొండ్ర రిష్యంత్ (వరంగల్), ములింటి షేక్ వాజిద్ (రంగారెడ్డి), గట్టుసాయి అభిషేక్ (రంగారెడ్డి) సాధించారు.
మెడికల్ విభాగంలో తొలి పది ర్యాంకులు వరుసగా పేరిగల నమ్రత (కర్నూలు), వై సంజీవ కుమార్ రెడ్డి (హైదరాబాద్), సామల శ్రీయాన్ (నిజామాబాద్), చేరుపల్లి సంజన (మేడ్చెల్), ముక్తేవి జయ సూర్య (సికింద్రాబాద్), గంజికుంట శ్రీవత్సవ్ (కర్నూలు), కేటీడీఎస్‌ఎస్ విజిత్ (పెద్దపల్లి), ఎ అంఘాలక్ష్మి (హైదరాబాద్), పి శ్రీ చైతన్య (కరీంనగర్), వి సత్యశ్రీ సౌమ్య (ఖమ్మం) సాధించారు.

చిత్రాలు..ఇంజనీరింగ్ టాపర్ వంశీనాథ్

*అగ్రికల్చర్ టాపర్ నమ్రత