రాష్ట్రీయం

ఎమ్సెట్ పాస్.. ఇంటర్ ఫెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాల్లో విజయం సాధించి, ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో 18933 మంది ర్యాంకులను కోల్పోయారు. వారు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో విజయం సాధిస్తే అపుడు వారికి ర్యాంకులను కేటాయిస్తామని కన్వీనర్ డాక్టర్ యాదయ్య తెలిపారు. ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,36,305 మంది హాజరుకాగా వారిలో 1,06,646 మంది అర్హత సాధించారు. ఇంటర్ పాసై, ఎమ్సెట్‌లో అర్హత సాధించిన వారు 94,592 మంది ఉన్నారు. ఎమ్సెట్‌లో అర్హత సాధించి ఇంటర్ ఫెయిల్ అయిన వారు 14,453 మంది కాగా, మరో 4171 మంది ఉత్తీర్ణత వివరాలు అందజేయలేదు. దీంతో కేవలం 94,592 మందికి మాత్రమే ర్యాంకులను ఇచ్చారు. అందులో బీసీ ఎ నుండి 5207 మంది, బీసీ బీ నుండి 17,524 మంది, బీసీ సి నుండి 493 మంది, బీసీ డి నుండి 14671 మంది, బీసీ ఇ నుండి 3965 మంది, బీసీ ఇ నుండి 3965 మంది, ఓసీ నుండి 36,554 మంది, ఎస్సీ నుండి 10209 మంది, ఎస్టీ నుండి 5879 మంది అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ స్ట్రీం నుండి పరీక్షకు 66,858 మంది హాజరుకాగా, వారిలో 60,651 మంది అర్హత సాధించారు. వారి లో ఇంటర్ పాసై , ఎమ్సెట్‌లో క్వాలిఫై అయిన వారు 54,490 మంది కాగా, ఇంటర్ ఫెయిల్ అయిన వారు 4480 మంది, అర్హత వివరాలు ఇవ్వని వారు మరో 3378 మంది ఉన్నారు. దాంతో 54,490 మందికి మాత్రమే ఎమ్సెట్ ర్యాంకులను ప్రకటించారు.
అగ్రికల్చర్ స్ట్రీంలో బీసీ ఎ నుండి 3539 మం ది, బీసీ బీ నుండి 9379 మంది, బీసీ సీ నుండి 544 మంది, బీసీ డీ నుండి 8830 మంది, బీసీ ఇ నుండి 4592 మంది, ఓసీ నుండి 9599 మంది, ఎస్సీ నుండి 12042 మంది, ఎస్టీ నుండి 5965 మంది అర్హత సాధించారు.
మైనార్టీలు: ఇంజనీరింగ్ స్ట్రీంలో 5867 మంది, అగ్రికల్చర్ స్ట్రీంలో 6607 మంది మైనార్టీలు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ స్ట్రీంలో క్రైస్తవులు 491 మంది, ముస్లింలు 5194 మంది, బౌద్ధులు 9 మంది, సిక్కులు 25 మంది, జైన్‌లు 44 మంది, ఇతర మైనార్టీలు 104 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీంలో క్రైస్తవులు 476 మంది, ముస్లిం లు 6064 మంది, బౌద్ధులు ముగ్గురు, సిక్కులు 12 మంది, జైన్‌లు 9 మంది, ఇతర మైనార్టీలు 41 మంది అర్హత సాధించారు. పాసైన వారిని తీసుకుంటే రెగ్యులర్ ఇంటర్మీడియట్ నుండి 1,04,216 మంది ఇంజనీరింగ్‌లోనూ, 59375 మంది అగ్రికల్చర్ స్ట్రీంలో ఉతీర్ణులయ్యారు. సీబీఎస్‌ఇ నుండి ఇంజనీరింగ్‌లో 1494 మంది, అగ్రికల్చర్‌లో 567 మంది అర్హత సాధించారు.