రాష్ట్రీయం

విద్యుదుత్పత్తి పెను సవాలే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: రానున్న ఎన్నికల ఏడాదిలో విద్యుత్ వ్యవహారం ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. సరఫరాపై సర్కారు లెక్కలకు, ట్రాన్స్‌కో వివరాలకు పొంతన కుదరకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా వచ్చే జనవరికి విద్యుత్‌పై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. భారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, అందుకు తగ్గట్టుగా సబ్సిడీ విద్యుత్‌ను అందివ్వాల్సి ఉంది. ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతలకు గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరమని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ట్రాన్స్‌కో లెక్కలు మరోలా ఉన్నాయి. రానున్న రెండేళ్లలో 3480 మెగావాట్లు, ఆ పై రెండేళ్లలో 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్ చెబుతోంది. ఈ ప్రకటనల మధ్య వ్యత్యాసం అయోమయానికి గురి చేస్తోంది. మంత్రి హరీశ్‌రావు వివరాల ప్రకారం గరిష్టంగా 3,234 మెగావాట్ల విద్యుత్ అవసరమని చెబుతున్నవాటికీ, అంత విద్యుదుత్పత్తి ట్రాన్స్‌కో అందించగలదా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికలు రూపొందిస్నున్నప్పటికీ, విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతున్నందున వచ్చే రోజుల్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా అంత సులువుకాదన్న వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలతోపాటు వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్‌ను పంపిణీ చేస్తే తప్ప ప్రభుత్వానికి ప్రతిష్ట పెరగదు. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టలకు అవసరమైన విద్యుత్‌ను ఈ వర్షాకాలంలోనే పంపణీ చేయాలని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు పరుగులు
పెడుతున్నారు. వచ్చే ఖరీఫ్ కోసం ఎత్తిపోతల పథకాల నుంచి సాగునీటిని అందించడానికి మంత్రి ఇప్పటికే దిశా నిర్దేశాన్ని చేశారు. ప్రస్తుతం చేపట్టిన విద్యుదుత్పత్తి ప్లాంట్ల నిర్మాణాలు పూర్తిదశకు వచ్చాయని, వచ్చే జూన్‌లో మరింత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరంతోపాటు ఈ ఏడాది ప్రారంభంకానున్న ఇతర ఎత్తిపోతల పథకాలకు 2206 మెగావాట్ల విద్యుత్ అవసరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులోకి రానున్న ఎత్తిపోతల ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయసముద్రం, జోగాపూర్, దేవాదుల, చెనాక-కొరాట, ఎస్సారెస్పీ, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయల్‌సాగర్, ఎఎమ్‌ఆర్, ఎల్లంపల్లి, కడెం, మంథని, ఎన్టీపిసి, రాజనర్సింహ (సింగూరు) భక్తరామదాసు, కొడిమల, అలీసాగర్, గుత్ప, ముక్తేశ్వర్ తదితర ఎత్తిపోతల ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా అవసరం. ఎత్తిపోతలకు సంబంధించి పంపుహౌజ్‌ల్లో ఎప్పటి నుంచి నీటి పంపింగ్ ప్రారంభమవుతుంది, ఎన్ని రోజులపాటు పంపింగ్ చేసే అవకాశం ఉంది, ఏ నెలలో ఎంత విద్యుత్ అవసరం అన్న మంత్రి ప్రశ్నలకు ట్రాన్స్‌కో అధికారులు బిత్తరపోతున్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్, రామగుండం, సోలార్, హైడల్, టీజీఎస్‌ల ప్లాంట్ల నుంచి విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్‌కో చెబుతోంది.