రాష్ట్రీయం

కృష్ణానది పునరుజ్జీవానికి జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: నానాటికి కాలుష్య కాసారంగా మారడంతో పాటు నీటి లభ్యత కరువు అవుతున్న కృష్ణానదికి పునర్జీనం తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచ వాటర్ కౌన్సిల్ సహాయంతో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ, నదుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థలు, ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌తో కలిసి పదేళ్ల పాటు పునఃర్జీవన పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందు కోసం కార్యచరణ రూపొందించేందుకు ఈనెల 22న నగరంలోని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ.ప్రకాష్ తెలిపారు. ఆదివారం నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జల వనరుల సంరక్షణ కోసం జాతీయ స్థాయిలో విధానం లేక పోవడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ, మహారాష్టల్రతో పాటు కర్నాటక రాష్ట్రాలకు ప్రధాన జల వనరుగా ఉన్న కృష్ణానదిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా పేరొందిన రాజేందర్ సింగ్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన నీటి పారుదల నిపుణులు హాజరు అవుతున్నట్టు చెప్పారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సదస్సును ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లో ఏడు నదులను సజీవం చేసిన రాజేందర్ సింగ్ సలహాలు, సూచనలతో పదేళ్ల పాటు సాగే మహాయజ్ఞానికి ప్రజలంతా చేయూత నివ్వాలని ఆయన కోరారు.