రాష్ట్రీయం

పిల్లల కిడ్నాప్ గ్యాంగ్‌ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 21 చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిస్తున్న బీహార్ గ్యాంగ్ మకాంవేసినట్టు జరుగుతున్న ప్రచారంపై తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగుతోంది. కిడ్నాపర్లు పెద్ద ఎత్తున రాష్టంలోకి దిగారని, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా సంచరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులూ అప్రమత్తమయ్యారు. పిల్లల కిడ్నాపర్ల ముఠాలు సంచరిస్తున్నట్టు అందిన సమాచారంతో రాత్రివేళల్లో ఆయా ప్రాంతాల ప్రజలు కంటిపై కనుకులేకుండా గడుపుతున్నారు. పలు గ్రామాల్లో యువకులు రాత్రివేళ గస్తీలు తిరుగుతున్నారు. అనుమానితులను పట్టుకుని దేహశుద్ధిచేసి, పోలీసులకు అప్పగిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం పతాక స్థాయికి చేరడంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. సోషల్ మీడియాలో కిడ్నాపర్లపై విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ సోమవారం ఖండించారు. ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా చేస్తోన్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఏ విధమైన గ్యాంగ్‌లు సంచరించడం లేదని చెప్పారు. మరోవైపు కిడ్నాపర్లపై ఆయా వర్గాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానాస్పందంగా సంచరిస్తున్న అపరిచితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అపరిచ, అనుమానితుల పట్ల, రాష్ట్రేతర ప్రాంతాల నుండి వలస వచ్చిన సంచార జాతుల పట్ల నిఘా వేశారు. అనుమానాస్పదంగా ఏ ఒక్కరు కనిపించినా అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే మానసికవ్యాధితో సంచరించేవారు, సైకో లక్షణాలున్న వారిని పోలీసులు ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు
జిల్లాలోని అనేక గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు వచ్చారని, ఇళ్ళలో చొరబడి పిల్లలను ఎత్తుకుపోయే గ్యాంగ్ సంచరిస్తోందన్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ కిడ్నాపర్ల సమాచారంపై కలకలం చెలరేగుతోంది. అయితే ఇటువంటి అసత్య సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా అనుమానితులు, కిడ్నాపర్లు పట్టుబడిన పక్షంలో 100 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని, లేక స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని త్ల ఎస్పీ విశాల్‌గున్నీ విజ్ఞప్తి చేశారు. వేసవి కాలం దృష్ట్యా దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉండటంతో గ్రామస్థాయిలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ
ప్రొద్దుటూరు, మే 21: ఓ రైతు నుంచి రూ. 15 వేలు లంచం తీసుకున్న కడప జిల్లా యర్రగుంట్ల మండలం కల్లమల్ల వీఆర్‌ఓ బాషావలీని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన రైతు ఓబులేసు పట్టాదారు పాసుపుస్తకం కోసం వీఆర్‌ఓను కలవగా రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం యర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న వీఆర్‌ఓ బాషావలీకి రూ. 15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డిఎస్పీ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు.