రాష్ట్రీయం

ఖరీఫ్‌పై దృష్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ఖరీఫ్ నారుమళ్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాల గురించి బుధవారం రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కృష్ణా రైతులకు జూన్‌లోనే నీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధాన జలాశయాల్లో 207 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మధ్య తరహా జలాశయాల్లో 107 టీఎంసీలు ఉండాలని, కానీ 27.9 టీఎంసీల నీరే నిల్వ ఉందని సీఎంకు అధికారులు వివరించారు. జల సంక్షరణ చర్యలు మరింత వేగవంతం చేయాలని, పంట కుంటల లక్ష్యం త్వరగా సాధించాలని సూచించారు. వర్షాకాలం నాటికి పూర్తి చేయాలన్నారు.
వదంతులు వ్యాపించే వారిపై చర్యలు
రాష్ట్రంలో వదంతులను వ్యాపింప చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వదంతుల కారణంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని వీరిపై దృష్టి సారించాలన్నారు. వదంతుల వల్ల జనంలో భయం చోటు చేసుకునే పరిస్థితి ఉందని, దీనిని నియంత్రించాలన్నారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెంచాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష చేయాలని ఆదేశించారు.