రాష్ట్రీయం

నెత్తురోడిన రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మే 26: రాజీవ్ రహదారి రక్తసిక్తమైంది. ఆర్టీసీ రాజధాని ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఓవర్ టేక్ చేయబోయి లారీని ఢీకొట్టింది. దీంతో ఆ లారీ అదుపుతప్పి రోడ్డుకు కుడివైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో లారీ, టాటా క్వాలీస్ వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. దుర్ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని రిమ్మనగూడ వద్ద జరిగింది. ఏసీపీ మహేందర్ అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్ వైపు నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీని మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ రాజధాని ఏసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (టీఎస్ 19 జెడ్ 0012) రిమ్మనగూడ శివారులో ఓవర్‌టేక్ చేయబోయి వెనుక నుండి లారీని ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న లారీ కుడి వైపునకు వెళ్లగా, సిద్దిపేట వైపు నుండి ఎదురుగా వస్తున్న మరో లారీతోపాటు టాటా క్వాలీస్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీల మధ్యలో క్వాలీస్ ఇరుక్కుపోయంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న జిన్నారం మండలానికి చెందిన గొర్ల మల్లేషం, గుండమ్మ, లక్ష్మణ్, పుష్ప, ఆకాశ్, నిహారిక, విజయలతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న సంధ్య, రాహుల్, సాయినిఖిల్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సమాచారం తెలుసుకున్న గడా అధికారి హన్మంతరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించడంతోపాటు మృతదేహాలను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్న 30 మందిని సిద్దిపేట, గజ్వేల్‌ల నుండి రప్పించిన అంబులెన్స్ వాహనాలలో హైదరాబాద్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుకు సిఎం ఆదేశాలు జారీ చేశారు.