రాష్ట్రీయం

నమ్మకద్రోహి మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 2: ప్రధాని నరేంద్ర మోదీ అంతటి నమ్మకద్రోహి, పచ్చి అబద్ధాలకోరు ఈ దేశంలో ఎవరూ ఉండబోరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నిత్యం దేవుళ్లను ఆరాధించే బీజేపీకి ప్రాతినిధ్యం వహించే మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం ఉల్లంఘిస్తూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నందుకు వచ్చే జన్మలో కాకుండా, ఈ జన్మలోనే తగిన శిక్ష అనుభవిస్తారని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన ద్వారా అన్ని విధాలుగా నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని తిరిగి ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకే గతంలో అలిపిరి పేలుడు సంఘటనలో ప్రాణాపాయం తప్పించి, ఆ తిరుపతి వెంకన్న తనకు పునర్జన్మ ఇచ్చాడన్న విశ్వాసం తనలో అణువణువునా ఉందన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ నిరంతరం కష్టపడుతూ గత నాలుగేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండంకెల వృద్ధిరేటు సాధిస్తూనే తమకు అన్యాయం చేసినవారికి గుణపాఠం చెప్పే స్థితిలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నాల్గవ నవ నిర్మాణ దీక్ష సందర్భంగా విజయవాడ బెంజిసర్కిల్‌లో శనివారం ఉదయం జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఢిల్లీ కంటే అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించుకోవాలని స్వయంగా చెప్పిన ప్రధాని మోదీ కేవలం 1500 కోట్లు ఇచ్చి 2500 కోట్లు ఇచ్చానంటూ అమిత్ షాతో అబద్ధాలు చెప్పిస్తూ వస్తున్నారని అయితే తాజాగా సింగపూర్ పర్యటనలో అక్కడి ప్రధాని మన అమరావతి నగరం గురించి ప్రస్తావించటం చూసి మోదీ సిగ్గుపడాలని ఆవేశంతో అన్నారు. మోదీకి ఆంధ్రుల పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకీ కక్ష సాధింపు అంటూ ప్రశ్నించారు. వారణాసి కంటే ఆహ్లాదం, పరిశుభ్రత, పచ్చదనానికి తిరుమల చిహ్నమంటూ ఈ ఆలయం వైపు కేంద్రం దృష్టి సారించటం మంచిది కాదని హెచ్చరించారు. మోదీని తానెంతో నమ్మి, విశ్వసించి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చినప్పటికీ తనకే వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా నిలుస్తూ వచ్చిన వైకాపా, జనసేనలతో కుమ్మక్కై తననే నిందింపచేసే స్థాయికి దిగజారారంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలోనే మోదీకి రైతులు గుర్తుకొస్తారని ఆపై రైతాంగం పట్ల కనీస విశ్వాసం కూడా చూపరంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో
స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌ల ప్రకారం వ్యవసాయ ఖర్చులన్నీ పోను 50 శాతం అదనపు ధరతో ప్రతి పంటకు ఎంఎస్‌పీ ధర నిర్ణయిస్తామని చెప్పి నేటి వరకు ఏ పంటకు కూడా ఈ ధర ఇవ్వటం లేదన్నారు. పైగా దిగుబడి పెరిగి రేట్లు పెరుగుతున్న సమయంలో విదేశాల నుంచి దిగుమతులు ప్రోత్సహిస్తూ రైతులను మట్టి కరిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గిస్తానని, నోట్ల రద్దుతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి తీరా ప్రజలకు బ్యాంకులపైనే విశ్వాసం లేకుండా చేశారని, పెన్షన్ల కోసం తాను బ్యాంకులను అడుక్కునే పరిస్థితి కల్పించారంటూ మోదీపై ధ్వజమెత్తారు. జీఎస్టీ వలన ఇడ్లీపై కూడా పన్ను వేసే పరిస్థితి కల్పించారని అన్నారు. పెట్రో ఉత్పత్తులపై తరచూ పదుల్లో రేట్లు పెంచుతూ తాజాగా పైసా తగ్గించటం ప్రపంచంలోనే అతి పెద్ద జోక్‌గా బాబు ఎద్దేవా చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కొంతమేర తాము సమర్థించినప్పటికీ మగవారిని కఠినంగా శిక్షించాలనే మోదీ నిర్ణయం ముస్లింలపై కక్ష సాధింపే అంటూ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను సైతం మోదీ విస్మరిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ నిర్మూలన సైతం పూర్తిగా విస్మరించారని అన్నారు. గుజరాత్ రాష్ట్రంపై చూపుతున్న శ్రద్ధలో అణుమాత్రం కూడా ఏపీ పట్ల మోదీ చూపటం లేదన్నారు.

చిత్రం..విజయవాడ బెంజిసర్కిల్‌లో శనివారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు