రాష్ట్రీయం

అవినీతికి చట్టబద్ధతా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, జూన్ 2: నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అవినీతికి చట్టబద్ధత కల్పించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సాధ్యమైందని జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని మూడురోడ్ల జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైద్యం, ఉపాధి, విద్య వంటి రంగాలు గ్రామీణ స్థాయికి చేరకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దపడుతున్నాయని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టి 15 ఏళ్లు అయ్యింది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విమర్శలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయేతప్ప గ్రామీణ ప్రాంతాలకు సాగు నీరందించే విధంగా చర్యలు చేపట్టకపోగా వరద నీరునే తోటపల్లి నీరుగా చిత్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి తావులేకుండా చేస్తామంటే నమ్మి టీడీపీకి ఓటేయాలంటూ ప్రచారం నిర్వహించామని, తీరాచూస్తే వైసీపీ కంటే మించిన అవినీతికి టీడీపీ పాల్పడుతోందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే కనబడిన చోటల్లా జెండాలు పాతేసి భూ కబ్జాలు, అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకుంటారన్న భయంతో టీడీపీకి మద్దతు ఇచ్చానని, అయితే అంతకుమించిన
అవినీతి జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఉచితంగా లభించాల్సిన ఇసుకకు ధర నిర్ణయించి ఇసుక మాఫియా ద్వారా కోట్ల రూపాయిలు దోచేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మాజీ ఎమ్మెల్యే భార్య పేరున నడుస్తున్న ఇసుక మాఫియానే నిదర్శనమని విమర్శించారు. రైతులు పండించే పొలాల్లో వచ్చే ఇసుకపొరలను కూడా ఇసుక మాఫియా వదిలిపెట్టడంలేదని, దీంతో రైతులు బోరుమంటున్న విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 19 జీవనదుల ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని అవసరమైన నిధుల కేటాయింపు ఈ జిల్లాలకు జరగకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో కుమారుడు లోకేష్‌కు మంత్రి వర్గంలో స్థానం కల్పించి ఉద్యోగం ఇవ్వడం కాదని ఎద్దేవాచేశారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని జ్యూట్ పరిశ్రమలను కొత్తగా తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు మూసేస్తున్నారని, దీంతో కార్మికులు పొట్టచేత పట్టుకొని వలసలు పోతున్నారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి అంటున్నారని ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ఎవరినీ రెచ్చగొట్టాల్సిన పనిలేదని, తాను రెచ్చగొట్టే మనిషిని కాదని, సమస్యల పట్ల ప్రశ్నించే స్వభావం కలిగిన వ్యక్తినన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. విజన్ 2020 పేరుతో రాష్ట్రాన్ని విడగొట్టారు ఇప్పుడు విజన్ 2050తో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు.

చిత్రం..చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్