రాష్ట్రీయం

గ్రామస్వరాజ్యం స్థాపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: మహాత్మాగాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం స్థాపించడంలో భాగంగా కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చామన్నారు. గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయి అధికారాలను ఇచ్చామన్నారు. లంబాడీ తండాలు, గిరిజన గూడేలాను గ్రామ పంచాయతీలుగా మార్చాలంటూ ఏడు దశాబ్దాల నుండి గిరిజనులు డామాండ్ చేస్తూ వచ్చారన్నారు. గత ప్రభుత్వాలు ఈ అంశంలో నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం 4383 గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్టు తెలిపారు. ఆదివాసీలు, చెంచులకు సంబంధించి 1320 గ్రామ పంచాయతీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు ఎక్కువగా వచ్చేట్టు చూస్తున్నామని, 14 వ ఆర్థిక కమిషన్ ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధుల ఇస్తోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా ప్రభుత్వమే చేయడం వల్ల పంచాయతీలపై ఆర్థిక భారం తగ్గుతోందన్నారు. హరితహారం బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పచెప్పామన్నారు.