రాష్ట్రీయం

బాగుపడింది ఆ నలుగురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా శనివారం గాంధీ భవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ రూపొందించిన తెలంగాణ కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత కె. జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శులు దాసోజు శ్రవణ్, వినోద్ రెడ్డి, బండ కార్తీకరెడ్డి, కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్యాగాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం బోగభాగ్యాలు అనుభవిస్తూ అన్ని వర్గాలను దగా చేసిందని విమర్శించారు. యువకులు, విద్యార్థులు, సబ్బండ వర్గాల పోరాటాలకు, చలించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయంగా త్యాగాలు చేసి తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ ఉన్నంత కాలం సోనియా పేరు చిరస్థాయిగా సువర్ణక్షారాలతో ఉంటుందని
అన్నారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మాయమాటలు చెప్పి, సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన తెలంగాణ రాలేదని, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అమరవీరులు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన అవమానాలు, కష్టాలు, నష్టాలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమరవీరుల కుటుంబాలను తీవ్రంగా అవమానించారని, వారి త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో వారు గౌరవంగా బతికే పరిస్థితి లేదని ఉత్తమ్ విమర్శించారు. 1200 మంది ఆత్మత్యాగాలు చేసుకుంటే వారి కుటుంబాలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కేసీఆర్ కొంత మందికి పరిహారం ఇచ్చి మిగతా వారి వివరాలు దొరకడం లేదని చెప్పడం వారిని అవమానించినట్లేనని అన్నారు. అమరవీరులను ఆదుకోవడం కంటే కేసీఆర్‌కు గొప్ప పనేమి ఉందని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం పండుగ చేద్దామని తెలంగాణ ఏర్పాటు చేసుకుంటే అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఇంత కంటే ఘోరం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఉపాధి పనులు చేస్తామని చెప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయానే్న పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు.

చిత్రం..రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో
జాతీయ జెండాను ఎగురవేస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి