రాష్ట్రీయం

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై పడిన కొండ చరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం ప్రాజెక్టు, జూన్ 2: ఈగలపెంట భూగర్భ పవర్ హౌస్ సమీపంలోని రోడ్డు మలుపువద్ద శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై నాలుగు గంటలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈగలపెంట భూగర్భ పవర్ హౌస్ సమీపంలోని మూల మలుపువద్ద ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో కొండ చరియలు విరగడం ప్రారంభమైంది. ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలుసుకొని స్థానిక ప్రజలు ముఖ్యంగా యువకులు జెన్‌కో వద్ద విధులను నిర్వహిస్తున్న ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఈగలపెంట కానిస్టేబుల్ ప్రేమ్‌కుమార్‌తో పాటు యువకులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై ఉన్న మట్టి రాళ్లను తొలగించడానికి టూరిజం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి జేసీబీని తీసుకొచ్చి మట్టిరాళ్లను పూర్తిగా తొలగించారు. నాలుగు గంటలకు పైగా ఆగిన వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఈగలపెంట, జెన్‌కో ప్లే గ్రౌండ్, దోమలపెంట బస్టాండ్ పరిసరాల్లో నిలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రూ.6కోట్లతో పాతాళగంగ నుంచి భూగర్భ పవర్ హౌస్ పై నుంచి ఈగలపెంట వరకు బైపాస్ రోడ్డు నిర్మించినా, అటవీశాఖ అనుమతి లేదని వినియోగంలోకి తీసుకురాలేదు. ఆ రహదారి ప్రారంభమైతే ఈగలపెంట నుంచి పాతాళగంగ వరకు మూడు మూలమలుపులు తగ్గి రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

చిత్రం.. ఘాట్ రోడ్డుపై విరిగిపడ్డ కొండ చరియలు