రాష్ట్రీయం

సంత్రగచ్చి- చెన్నై సెంట్రల్ మధ్య అంత్యోదయ వీక్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: మరో కొత్త రైలు పట్టాలెక్కబోతోంది. సంత్రగచ్చి- చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య అంత్యోదయ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఈనెల 4న హౌరాలో ప్రారంభం కానుంది. 02841 నెంబర్‌తో ప్రతి సోమవారం సంత్రగచ్చి నుంచి, ప్రతి బుధవారం చెన్నై సెంట్రల్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. హౌరాలో 4న మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.20 గంటలకు విశాఖ, ఇక్కడ 25 నిమిషాల హాల్ట్ అనంతరం బయలుదేరి చెన్నై సెంట్రల్‌కు అదేరోజు రాత్రి 7.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సంత్రగచ్చి జంక్షన్ నుంచి బయలుదేరాక ఖరగ్‌పూర్ జంక్షన్, బాలాసోర్, భద్రక్, జయపూర్ కియోంజర్‌రోడ్డు, కటక్ జంక్షన్, భువనేశ్వర్, ఖుర్దారోడ్డు జంక్షన్, బాలుగామ్, చత్రపూర్, బ్రహ్మపూర్, సోంపేట, పలాస, శ్రీకాకుళంరోడ్డు, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు జంక్షన్, సూళ్లూరుపేట స్టేషన్లలో ఆగి చెన్నై సెంట్రల్‌కు చేరుకుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో రెగ్యులర్ ట్రైన్‌గా 22842 నెంబర్‌తో నడుస్తుంది. ప్రారంభం రోజున 02841 నడిచే రైలు ఆ తరువాత 22841గా మారుతుందని రైల్వే అధికారులు తెలిపారు. అప్పుడు బయలుదేరే సమయం, చేరే సమయాల్లో కూడా స్వల్పగా మార్పులుంటాయన్నారు.
దీని ప్రకారం 22841 రైలు సంత్రగచ్చిలో ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు బయలుదేరి విశాఖకు మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు చేరుతుంది. ఇక్కడ 25 నిమిషాల హాల్ట్ తరువాత బయలుదేరి చెన్నై సెంట్రల్‌కు అదేరోజు రాత్రి 10.45 గంటలకు చేరుతుంది. చెన్నై సెంట్రల్ నుంచి 22842 నెంబర్‌తో ప్రతి బుధవారం ఉదయం 8.10 గంటలకు బయలుదేరి విశాఖకు అదేరోజు రాత్రి 8.35 గంటలకు వస్తుంది. ఇక్కడ 20 నిమిషాలపాటు హాల్ట్ అనంతరం బయలుదేరి గురువారం ఉదయం 10.25 గంటలకు సంత్రగచ్చికి చేరుతుంది. 16ఎల్‌హెచ్‌బి సెకెండ్ క్లాస్ కోచ్‌లతో నడిచే ఈ రైలులో రెండు బ్రేక్, లగేజీ కమ్ జనరేటర్ కార్ల సదుపాయం కూడా ఉంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.