రాష్ట్రీయం

అమరావతిలో అవయవ మార్పిడి ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అమరావతిలో అవయవ మార్పిడి (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్) ఆసుపత్రి నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు మహమద్ రేలా ముందుకు వచ్చారు. ప్రపంచంలో మేటి అవయవ మార్పిడి నిపుణుడు, భారత్ యూనివర్సిటీ చాన్స్‌లర్ మహమద్ రేలా శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిశారు. మనిషి ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రిని అమరావతిలో నిర్మించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ అమరావతిలో నిర్మించతలపెట్టినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. మనిషిలోని గుండె, కిడ్నీ, కాలేయం, లంగ్స్, యూట్రెస్ వంటి ప్రధాన అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్ర చికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు. తాను ఇంతవరకు 4,500 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించానని వివరించారు. ఒక తల్లి తన కుమార్తెకు పిల్లలు పుట్టకపోతే ఆ తల్లి తన యుట్రెస్‌ను కుమార్తెకు దానం చేయడం వలన కుమార్తెకూ పిల్లలు పుడతారంటూ అవయవాల మార్పిడి ఆవశ్యకతను తెలిపారు. ఇండియాలో ఇటువంటి ఆసుపత్రి ఇప్పటివరకూ లేదని అన్నారు. అంతర్జాతీయ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేయడం జరుగుతుందని చెప్పారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాల భూమి అవసరం అవుతుందని, అందుకు కావలసిన సహకారం అందించమని ముఖ్యమంత్రిని కోరారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అవయవదానం చేస్తే ప్రాణదానం చేసినట్లేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. స్వస్థ్ జీవన్ దాన్ డొనేషన్ ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగిందని ఆర్గాన్స్‌ని డొనేట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రముఖమైన ప్రాధాన్యత కలిగిన ఆసుపత్రులు అమరావతిలో నిర్మించడం వలన రాష్ట్రంలో మెడికల్ టూరిజం డెవలప్ అవుతుందని, ఎంతో మందికి మంచి నాణ్యత కలిగిన వైద్యం అందుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో భేటీ అయిన
అవయవ మార్పిడి నిపుణుడు డాక్టర్ మహమద్ రేలా