రాష్ట్రీయం

బైసన్ పోలో గ్రౌండ్‌లో ప్యారామోటారింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్‌లో పారాచూట్‌తో కూడిన ప్యారామోటారింగ్ ప్రారంభమైంది. నగరవాసులను అలరించేందుకు ఏర్పాటు చేసిన ప్యారమోటారింగ్‌ను డీజీపీ ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక శాఖ, అడ్వంచర్ స్పోర్ట్స్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్యారమోటారింగ్ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీజీపీ కోరారు. గగన విహారం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్యారమోటారింగ్ మంచి అనుభూతిని కలిగించిందన్నా రు. సాధారణంగా పారాచూట్ల ద్వారా గాల్లోకి వెళ్లే పద్ధతిలో పైకి వెళ్లాకే పారాచూట్ తెరుచుకుంటుందని, కానీ దీనిలో కిందనే గాలితో నిండిన పారచూట్ మోటార్ ఇంజన్‌కు కలిసి ఉండడంతో దాని ప్రభావంతో పైకి లేచి కావాల్సిన డైరక్షన్‌లో తిరిగే విధంగా తయారు చేశారన్నారు. ఇది నూరు శాతం భద్రతతో కూడుకున్నదని, ఎలాంటి భయం లేకుండా గగన విహారం చేయవచ్చని తెలిపారు. అంతేకాకుండా వీటిని నడిపే వారు ఆషామాషీ వ్యక్తులు కాదని, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాణిజ్య విమానాలు నడిపే ఎంతో అనుభవం ఉన్న రెగ్యులర్ పైలెట్లు అని అన్నారు. ఈ ప్యారామోటారింగ్‌కు జాతీయ, స్ధానిక ఏవియేషన్ శాఖలు ఇచ్చిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 3,4, 5 తేదీల్లో కొనసాగే ప్యారమోటారింగ్ అవకాశాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి 10 ప్యారమోటారింగ్‌లను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశామని చెప్పారు. అతవరణ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అనేక వినోద కార్యక్రమాల్లో ఇది ఒకటని చెప్పారు. నిపుణులైన వారు వీటిని నిర్వహిస్తారని, పూర్తి రక్షణతో వీటిని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్‌ను తిలకించేందుకు బైసన్ పోలో గ్రౌండ్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారు. మిలటరీ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..సికింద్రాబాద్ బైసన్ పోలోగ్రౌండ్‌లో మూడు రోజులపాటు సాగే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి ప్రజలకు ధైర్యం కలిగించేందుకు పారాచూట్ రైడ్ చేసి చూపుతున్న దృశ్యం