రాష్ట్రీయం

జనం సొమ్ము.. టీడీపీ సోకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 4 : సొమ్ము ఒకరిది...సోకు మరొకరిది అన్నట్లుగా తెలుగు తమ్ముళ్ల వ్యవహారాలు మారిపోయాయంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడుకు చేరుకున్న జగన్‌ను కలుసుకున్న పలువురు డ్వాక్రా మహిళలు నిధుల దుర్వినియోగంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. తమ పేరుతో నకిలీ ఖాతాలు ప్రారంభించిన అధికార పార్టీ నేతలు గత మూడేళ్లుగా దాదాపు రూ.35 లక్షల వరకు కాజేశారని, మరో రూ.25 లక్షల వరకు కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం కమిషన్ కూడా డ్వాక్రా గ్రూపు సభ్యులకు ఇవ్వకుండా జన్మభూమి కమిటీల సభ్యులు, తెలుగు తమ్ముళ్లు కలిసి పంచుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ఐకేపీ ద్వారా జరిగిన లావాదేవీలు పరిశీలిస్తే అన్ని బయటకు వస్తాయని, వీటిపై తక్షణం విచారణ జరిపించాలని వారు కోరారు. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పెనుగొండ శివారులో జిల్లా వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు షేక్ ఆలీ జగన్‌ను కలుసుకుని పలు సమస్యలను ప్రస్తావించారు. ప్రముఖ విద్యావేత్త జి తమ్మయ్య నేతృత్వంలో జగన్‌ను కలిసిన రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. వేతన సవరణ
బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని, ఈ విషయంలో చొరవ చూపి న్యాయం చేయాలని కోరారు. అలాగే గాండ్ల కులస్థు జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. రాష్ట్ర జనాభాలో దేవతీ కుల గాండ్లు, తెలికుల కులస్థులు దాదాపు మూడు శాతం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని, తమకు ఎలాంటి గుర్తింపు లేదని వారు పేర్కొన్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. పాదయాత్రలో జగన్‌ను వైసీపీ నేత వై ఎస్ వివేకానంద రెడ్డి కలుసుకున్నారు. ఈ యాత్ర పూర్తిగా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పధకం రద్దుపై జగన్ చేసిన ప్రకటన పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ఉపాధ్యాయులు పాదయాత్రలో జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు తమ సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయలేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌కు వివరించారు.