రాష్ట్రీయం

షాక్ ట్రీట్‌మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 4: పెట్రో ధరలను పైసల్లో తగ్గంచి కేంద్రం షాక్ ఇస్తుంటే, పీఎం రిలీఫ్ ఫండ్‌కు 9 పైసల చెక్కు ఇచ్చి కేంద్రానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. సోమవారం జరిగిన ప్రజావాణిలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌కు వి.చందు అనే యువకుడు 9పైసల చెక్కు ఇస్తూ పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందచేయాలని కోరడం సంచలనమైంది. లీటరు పెట్రోలు ఖరీదు చేసిన చందు, తగ్గింపు ధర తొమ్మిది పైసలు పీఎం ఫండ్‌కు ఇస్తూ కేంద్రం వైఖరిని ఎండగట్టాడు. ఇప్పటికే ప్రభుత్వం ఒక పైసా పెట్రోలు ధరను తగ్గించి చర్చకు తెరలేపగా, తాజాగా సోమవారం తొమ్మిది పైసలు తగ్గించిన వైనంపై చందు ఈ విధంగా వింత నిరసన తెలిపారు.