రాష్ట్రీయం

తెరాసకు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వం రద్దును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. శాసనసభ్యత్వం రద్దును సింగిల్ జడ్జి బెంచ్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ 12మంది తెరాస ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేశారు. అయితే వారి విజ్ఞాపనను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లపై రాజకీయ దురుద్ధేశ్యంతో అనర్హత వేటు వేశారని, వాళ్ల తరఫున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
కాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్‌ఫోన్స్ విసిరి దాడి చేశారంటూ కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన విషయం పాఠకులకు విధితమే. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కోమటిరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ల అనర్హతకు సంబంధించి అప్పీలు చేయాలంటే శాసనసభ తరఫున చేయాలే తప్ప వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు చేయడానికి లేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 194(3) కింద శాసనసభ్యుడిని సభ నుండి తొలగించే అధికారం సభకు మాత్రమే ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. 2018 ఏప్రిల్ 17న ఏక సభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును తెరాస ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహా 11మంది సవాలు చేశారు.