రాష్ట్రీయం

సమ్మె హారన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 7నుంచి సన్నాహక ప్రక్రియ ప్రారంభం * ప్రకటించిన గుర్తింపు యూనియన్ టీఎంయూ
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమ డిమాండ్ల పట్ల సానుకూల స్పందన రాకపోవడంతో గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. 7నుంచి సమ్మె నిర్వహణ ప్రక్రియ, సన్నాహక పనులు మొదలు పెట్టి 11నుంచి సమ్మె చేస్తున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం ఎల్బీనగర్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్టీసీ కార్మిక సంఘాల కేంద్ర కమిటీలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో 7న ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని, 8న ప్రాంతీయ కార్యాలయాల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పనిభారం విపరీతంగా పెరగడం, పదవీ విరమణ చేసిన తర్వాత ఆ స్థ్ధానంలో కొత్తవారిని నియమించకపోవడం, కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం తదితర డిమాండ్లతోపాటు ఆర్టీసీ పరిరక్షణకు సమ్మె చేయడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే టీఎంయూ గుర్తింపు సంఘంతోపాటు మిగిలిన కార్మిక సంఘాల జేఏసీ విడి విడిగా సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి అందజేశాయి. మంత్రివర్గ ఉపసంఘం కూడా పలు దఫాలుగా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె సైరన్ మోగించారు. డిమాండ్లలో అతి ముఖ్యమైన వేతన సవరణ చేపట్టి కార్మికులకు గత ఏడాది ఏప్రిల్ నుంచి సవరించిన వేతనాలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే ఆర్టీసీని ఆదుకునేందుకు, కార్మికుల సంక్షేమానికి చేయాల్సింది చేశాం.. మళ్లీ వేతన సవరణ అంటే ఎలా..? అంటూ మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై కస్సుమన్నారు. కాదు గీదూ అని సమ్మెకు
పోతే ఇక చేసేదేముంది, ఆర్టీసి ఇక అటు నుంచి అటే పోతే..అంటూ తెగేసి చెప్పారు. దీంతో అంతర్మధనంలో పడ్డ కార్మిక సంఘాలు మరికొన్ని రోజులు వేచి చూశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటిస్తారని, దీంతో పాటే తమకూ వేతన సవరణపై ప్రభుత్వం ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా టిఎస్‌ఆర్టీసి కార్మిక సంఘం వేసి చూసింది. ప్రభుత్వం ఆ ప్రకటనను వాయిదా వేసుకోవడంతో ఆర్టీసికి నిరాశే మిగిలింది. మంత్రుల కమిటీ కూడా కొంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పడంతో వేచి చూసి తప్పని పరిస్థితిలో సమ్మె బాహుటా ఎగుర వేశారు. దీంతో సమ్మె అనివార్యమైతే 10వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఏదైనా సానుకూల సందేశం వస్తే తప్ప సమ్మె తప్పదని స్పష్టమవుతోంది. కాగా మిగిలిన కార్మిక సంఘాల జెఏసి ఈ సమ్మె తమ వైఖరిని మంగళవారం ప్రకటించనుంది.