రాష్ట్రీయం

బీజేపీ గెలుపు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 5: ఈ ఏడాది చివర్లో జరిగే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపియే గెలుస్తుందని ఇందులో సందేహమే లేదని కేంద్ర సామాజిక న్యాయం, మానవవనరుల పరిరక్షణ శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటనకు విచ్చేసిన ఆయన మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగేళ్ల తమ పాలన అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచంలోనే దేశ ప్రతిష్టను శిఖరాగ్రస్థానానికి తీసుకెళ్లారని తెలిపారు. 2019 ఎన్నికల్లో సైతం దేశ వ్యాప్తంగా బీజేపీ గెలుస్తుందని.. దేశ ప్రజలు మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీనే కోరుకుంటున్నారని తిరిగి మోదీ దేశ ప్రధాన కావడం తథ్యమని అన్నారు. 2014 ముందు ఉన్న యూపీఏ ప్రభుత్వం పదేళ్ల పాలన కుంభకోణాలతో దేశాన్ని అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు. దేశ పరువును, ప్రతిష్టను సర్వనాశనం చేశారని కాంగ్రెస్ అంటే కుంభకోణాల పార్టీగా ప్రజలు చర్చించుకునే స్థాయికి వచ్చిందని ఎద్దేవా చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే సర్కార్ దేశంలో అవినీతిని కడిగేసే పనిని ముందుగా చేపట్టిందని అందుకే నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో ఒక్క కుంభకోణం లేదని ఇది నరేంద్రమోదీ పాలనకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు మంచి బుద్ధిని ఇవ్వాలని తాము కోరుకుంటున్నామని వారికి మంచి బుద్ధి అంటే దేశంపై, మమకారం పెరిగేవిధంగా వారిలో దేశభక్తి వచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో భారతసైన్యంపై రాళ్లు రువ్విన ముష్కరులకు మద్దతు ఇచ్చి శభాష్ అన్నవారు దేశ భక్తులు ఎలా అవుతారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తాము దేశంలోని యువతను కోరుకునేది మంచి దేశభక్తులుగా ఉండాలని దాంతో దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఉంటూ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తామంటే ఎలా సహిస్తామని ప్రతి పౌరుడికి దేశ భక్తి ఉండాల్సిందేనని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి చెందిందని.. అది చెప్పుకోవడానికి కాంగ్రెస్ అధినాయకులు సిగ్గుపడుతున్నారని బీజేపీ గెలుపును తట్టుకోలేకే ఎన్నికల తర్వాత అపవిత్రమైన పొత్తుతో అధికారం చేపట్టారని ఇది మూన్నాళ్ల కాపురమేనని ఆరోపించారు. కర్ణాటకలో ఆరునెలల తర్వాత ఎప్పుడు రాజకీయ సంక్షోభం వస్తుందోనని ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఏడు వేల కేంద్రాల ద్వారా దివ్యాంగులకు, వికలాంగులకు క్యాంపులు నిర్వహించి వారికి కావల్సిన సామాగ్రిని దాదాపు రూ. 620 కోట్లు ఖర్చు చేసి పరికరాలను అందించిన ఘనత కూడా తమకే దక్కిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలాంటి వెనకబడిన ప్రాంతంలో దివ్యాంగులను, వికలాంగులను ఆదుకున్న చరిత్ర కూడా నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశంలో కాంగ్రెస్ నాయకులు ఇక అధికారంలోకి ఇప్పట్లో వస్తామనుకోవడం వారి భ్రమ అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి కాంగ్రెస్ సంబర పడిపోతుందని ఇవి ప్రామాణికం కావని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరోసారి పరాభవం తప్పదని ఆయన జ్యోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని ఫ్రంట్‌లు అయినా ఏర్పాటు చేసుకునే హక్కు ఉందని అది రాజ్యాంగంలో ఉంది అని దానిని ఎవరూ తప్పుపట్టలేరని అన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.