రాష్ట్రీయం

శాట్ అధికారే సూత్రధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏటి-శాట్)లో నకిలీ క్రీడా సర్ట్ఫికెట్లను జారీ చేయడం ద్వారా మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పలువురు అధికారులు, కమిటీ సభ్యుల నివాసాల్లో సోదా నిర్వహించారు. గత ఏడాది జరిగిన ఈ కుంభకోణంలో అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో సీట్లు పొందేందుకు వీలుగా నకిలీ సర్ట్ఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించిన అర్హులైన విద్యార్థులు ఆందోళనకు గురవడంతో వారి తల్లిదండ్రులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ అంశంపై స్వయంగా సీఎం కేసీఆర్ దృష్టిసారించి విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని పలు బృందాలు బుధవారం మూకుమ్మడి సోదా నిర్వహించాయి. ఈ విచారణలో నకిలీ స్పోర్ట్స్ సర్ట్ఫికెట్లు జారీ చేయడంలో శాట్ డిప్యూటీ డైరక్టర్ వెంకటరమణను కీలక సూత్ర ధారిగా గుర్తించారు. లక్షల్లో లంచాలు తీసుకుని ఈ సర్ట్ఫికెట్లు జారీ చేసినట్లు ఏసీబీ తనిఖీలో నిర్ధారణ కావడంతో బుధవారం రాత్రి వెంకటరమణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ అధికార వర్గాల సమాచారం ప్రకారం 12 మెడికల్ సీట్లను నకిలీ సర్ట్ఫికెట్ల జారీతో అమ్ముకున్నట్లు నిర్ధారించారు. అర్హులైన తమకు స్పోర్ట్స్ కోటాలో సీట్లు రాలేదని బాధితులు భరత్‌చంద్రారెడ్డి, హర్షితారాజ్‌ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దీంతో ఏసీబీ డిఎస్పీ సత్యనారాయణ బృందం స్పోర్ట్స్ కమిటీలోని సభ్యులు శోభ, చంద్రారెడ్డి, విమలాకర్, మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శాట్ కార్యాలయంలోని డిప్యూటీ డైరెక్టర్ రమణ చాంబర్‌లోనూ తనిఖీల నిర్వహించారు. 2017లో జారీ చేసిన స్పోర్ట్స్ సర్ట్ఫికెట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగాయి. ఎల్‌బి నగర్‌లోని సైక్లింగ్ కోచ్ గుర్రం చంద్రారెడ్డి, బాగ్‌లింగంపల్లిలోని విమలాకర్ నివాసంలోనూ, మరోసభ్యురాలు శోభకు చెందిన రామాంతపూర్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదా నిర్వహించి సాయంత్రానికి పూర్తి చేశారు. ఈ కేసులో ఎంత మొత్తం వసూలు చేశారు, ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా..?, ఎవరెవరికి లంచాలు ఇచ్చారనే కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని ఎసిబి డిజి పూర్ణచంద్రరావు వెల్లడించారు. కాగా ఈ కుంభకోణంలో మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడు వెంకటరమణ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా, దొరికిన డాక్యుమెంట్లను పరిశీలించి మిగిలిన వారిన అరెస్టు చేసే అవకాశం ఉంది.