రాష్ట్రీయం

జరిగింది అన్యాయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌ది ద్రోహం.. బీజేపీది నమ్మకద్రోహం
స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం నాటకం భావితరాల కోసం ధర్మపోరాటం కడప నవ నిర్మాణదీక్షలో చంద్రబాబు
కడప, జూన్ 6: ‘కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మాం. ఎదురుచూశాం. ఇక్కడ మరో పార్టీ ఉందనే ఆలోచనతో రాష్ట్రానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్‌ది ద్రోహం..బీజేపీ ప్రభుత్వానిది నమ్మక ద్రోహం’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం, వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బుధవారం నిర్వహించిన నవ నిర్మాణదీక్ష బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 60 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ నగరాన్ని వదిలి కట్టుబట్టలతో మిగిలేలా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధిలో తామూ భాగస్వాములమవుతామని నమ్మించి ద్రోహం చేసిందన్నారు. ఆ రోజు రాష్ట్భ్రావృద్ధికోసం ఒక జాతీయ పార్టీ అండ ఉండాలనుకుని, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను వ్యతిరేకించే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతి, నెల్లూరు, అమరావతి సభల్లో నరేంద్రమోదీ హామీలు ఇచ్చారన్నారు. అయితే నాలుగేళ్లయినా వాటిలో ఏ ఒక్కటీ తీర్చలేదన్నారు. 14వ ప్రణాళిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని, దానికి తగ్గకుండా ప్యాకేజీ ఇస్తామంటే నమ్మామని ముఖ్యమంత్రి అన్నారు. మొదటే ఎందుకు విభేదించలేదని కొందరు అడుగుతున్నారని, హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే నమ్మామన్నారు. నాలుగు సంవత్సరాల్లో 29 సార్లు మోదీని కలిసి విన్నవించాం, ఎదురుచూశామన్నారు. మన రాష్ట్రానికి ఇవ్వడానికి అడ్డువచ్చిన 14వ ప్రణాళిక సంఘం నిబంధనలు, వేరే రాష్ట్రానికి ఇవ్వడానికి కేంద్రానికి అడ్డురాలేదన్నారు. ఇది జరిగాకే ఇక లాభం లేదనుకుని తిరుగుబాటు చేశామన్నారు. విభజన చట్టంలో ఉన్న కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నాటకం ఆడుతోందన్నారు. ఈ పరిశ్రమ కోసం రూ.200 కోట్లు ఈక్విటీ ఇమ్మని, భూమి ఉచితంగా ఇవ్వమని కేంద్రం అడిగిందన్నారు. అన్నీ ఇస్తామని చెప్పినా ఇంతవరకూ ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా లేదన్నారు. ఈ సందర్భంగా సభికులనుద్దేశించి ముఖ్యమంత్రి ‘కడపకు స్టీల్ ప్లాంట్ రావాల్నా.. వద్దా’ అంటూ ప్రశ్నించారు. సభికుల నుండి కావాలనే సమాధానం రావడంతో ఇవ్వకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు.
కేసుల కోసం ఇక్కడున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాలూచీ పడిందని, దీంతో బీజేపీ వారు టీడీపీ లేకపోతే ఇంకో పార్టీ ఉందని రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వారు నేరుగా ప్రధాని దగ్గరకు పోతారు, విశ్వాసం ప్రకటిస్తారు, బయటకు వచ్చి అవిశ్వాసం పెడతామంటారు అంటూ పరోక్షంగా వైఎస్ జగన్‌ను విమర్శించారు. తాము పూర్తిగా తెగదెంపులు చేసుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే ఏ ఒక్కరూ సమర్థించలేదన్నారు. తాము అవిశ్వాసం పెడితే దేశంలోని అన్ని పార్టీలు సమర్థించాయని ముఖ్యమంత్రి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా కూడా డ్రామానే అని, ఏప్రిల్‌లో రాజీనామా చేస్తే ఆమోదించి ఉంటే ఈపాటికి ఉప ఎన్నికలు జరిగిపోయి ఉండేవని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకూ రాజీనామాలు ఆమోదించకుండా లాలూచీ పడి, ఇప్పుడు ఆమోదించాలని లేఖ ఇవ్వడం నాటకం కాదా అని అన్నారు. రాజీనామాలు ఆమోదించినా సంవత్సరం లోపు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగనున్నందున ఉప ఎన్నికలు రావని అన్నారు. ఏప్రిల్‌లో రాజీనామా చేసిన వారు ఇప్పటివరకూ జీతాలు తీసుకోవడం ఎవరిని మోసం చేయడానికని బాబు ప్రశ్నించారు.
తమిళనాడులో బీజేపీ ఆడే నాటకాలు, ఆంధ్రప్రదేశ్‌లో సాగవని సీఎం అన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని తాము పిలుపునిస్తే అక్కడి తెలుగువాళ్లు స్పందించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కర్నాటకకు వెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసం చేసిన బీజేపీకి ఓటు వేయాలని చెప్పడం ఎవరిని మోసం చేయడానికని అన్నారు. వారికి వారి కేసులే ముఖ్యం గానీ రాష్ట్భ్రావృద్ధి కాదన్నారు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఒక శాసనసభ, ఒక పార్లమెంట్ స్థానం మాత్రమే వచ్చే సరికి ఆ పార్టీ నేతలు ఇప్పుడు అద్వానీని అడుక్కుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏటీఎంలలో డబ్బుల్లేవు, బ్యాంకుల్లో డబ్బుల్లేవు, నోట్ల రద్దు తర్వాత ముద్రించిన నోట్లు ఏమయ్యాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పెట్రోల్ ధర ఒక్క పైసా తగ్గించి, ధరల తగ్గింపును ఒక జోక్ చేశారని ఎగతాళి చేశారు. నమ్మకద్రోహం చేసిన వారిపై తాము ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఇది తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావి తరాల కోసం అంటూ ముఖ్యమంత్రి చప్పట్ల నడుమ ప్రకటించారు.

ప్రసంగం మధ్యలో వౌనం...
కాగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సాయంత్రం 5 గంటలకు సమీపంలోని మసీదు నుండి నమాజ్ వినిపించింది. దీంతో నమాజ్ ముగిసేంతవరకు చంద్రబాబు వౌనం పాటించారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.