రాష్ట్రీయం

కుదరని ఏకాభిప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: గోదావరి నదీ జలాల పంపిణీ తరహాలో కృష్ణానది జలాల పంపిణీకి నియమావళి ఏర్పాటు చేయనున్నట్టు కృష్ణనది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. నియమావళిని తయారు చేశాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు అందజేయనున్నట్టు బోర్డు తెలిపింది. నియమావళి ప్రకారమే ఇరు రాష్ట్రాలు నడుచుకోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించుకుంటున్న నీటి పరిణామాన్ని లెక్కించేందుకు హెడ్ రెగ్యులేటర్ వద్ద లుకింగ్ డాప్లర్ ప్రొఫైలర్ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ హెచ్‌కె సాహు అధ్యక్షతన మంగళవారం జలసౌధలో బోర్డు సమావేశమైంది. తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇఎన్‌సి నాగేందర్, ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇఎన్‌సి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల వాదనలు పరస్పరం విరుద్దంగా ఉండటంతో రెండు వారాలలో మరోసారి సమావేశమై నిర్ణయం
తీసుకుందామని చైర్మన్ సాహు వెల్లడించారు. సమావేశంలో ప్రధానమైన జలాల పంపిణీ ఎటూ తేలకపోవటంతో ఇతర సమస్యలపై కూడా ఏ నిర్ణయం తీసుకోలేదని సమావేశం అనంతరం ఎస్‌కె జోషి మీడియాతో అన్నారు. నదీ జలాల పంపకం తేలకపోవడంతో త్వరలో మళ్లీ జరిగే సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు. జలాల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో అప్పటి వరకు మంచినీటి అవసరాల కోసం 20 శాతం నీటిని వినియోగించుకోవాలని బోర్డు ఆదేశించింది. జలాల పంపిణీపై సమగ్రమైన, శాస్ర్తియమైన అధ్యయనం చేయడం ద్వారా లోపాలను సరిదిద్దవచ్చని బోర్డు అభిప్రాయపడింది. అధ్యయనానికి పుణెకు చెందిన సిడబ్ల్యుపిఆర్‌ఎస్‌ను సంప్రదించాలని బోర్డు నిర్ణయించింది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే తరహా అధ్యయనం చేయాలనే అభిప్రాయాన్ని బోర్డు వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువలో నీటి నష్టాలపై బోర్డు చర్చించింది. అలాగే ఈ ఏడాది 2018-19 సంవత్సర నీటి నష్టాలను పరిశీలించడంతో పాటు మిగిలిన కాలువలలో కూడా జలాలను పరిశీలించాక అధ్యయనం చేయాలని బోర్డు నిర్ణయించింది. అప్పటి వరకు శ్రీశైలం జల విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలు సమానంగా చేరిసగం వాడుకోవాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించే కొత్త ప్రాజెక్టుల డిపిఆర్‌లను ఇరు రాష్ట్రాలు పరస్పరం ఇచ్చుకునేందుకు అంగీకరించినట్టు బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.