రాష్ట్రీయం

రిటైర్డ్ మున్సిపల్ డీఈఈకి రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: అవినీతి కేసులో రిటైర్డు మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)కి ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ఇందుకు సంబంధించి ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో డిఇఇగా పని చేస్తున్నప్పుడు ఎం.ఏ రషీద్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హేండెడ్‌గా చిక్కారు. జి.రజనీకాంత్‌కు సిసి రోడ్డు నిర్మాణంలో కొలతలు తనిఖీ చేసి పూర్తి చేసేందుకు గాను రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు రజనీకాంత్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో విచారణ పూర్తయి నేరారోపణ రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్ష విధించింది.