రాష్ట్రీయం

ప్రభుత్వం దూకుడు...సిబ్బంది పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలోని వ్యవసాయ సిబ్బంది తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు. రైతులు కూడా సకాలంలో విత్తనాలు అందక ఇక్కట్లుపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకటి, రెండురోజుల్లో నైరుతీరుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని ఒకవైపు భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు, వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయిలో పనిచేసే ఏఈఓలు (అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు), ఏఓలు విత్తనాలు, ఎరువుల క్రయవిక్రయాలపై తీరికలేకుండా ఉండాల్సిన తరుణం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతులకు విత్తనాలు అందించాల్సిన సమయం ఇదే. ఇప్పటి నుండి జూలై చివరి వరకు కూడా జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, పత్తి తదితర పంటల విత్తనాలు వేయడం, వరినాట్లు వేయడం కొనసాగుతుంది. ప్రభుత్వం తరపున సబ్సిడీ విత్తనాలు ఇదే సమయంలో ఏఈఓలు, ఏఓలు పంపిణీ చేస్తారు.
దాదాపు ఆరులక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్టు అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఇంత పెద్ద ఎత్తున విత్తనాల పంపిణీ చేయడం అంటే మహాయజ్ఞంగా ఉంటుందని క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందకపోతే పెద్ద ఎత్తున రైతుల నుండి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. సకాలంలో విత్తనాలు వేయకపోతే రాష్ట్ర స్థాయిలో పంటల ఉత్పత్తి దెబ్బతింటుంది.
ఇదిలావుండగా ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. మండలస్థాయిలోని ఏఓల కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఒకవైపు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తాజాగా రైతుబంధు జీవితబీమా పథకం చేపట్టింది. ఈ పథకం అమల్లో కూడా ఏఈఓలు, ఏఓలదే కీలకపాత్ర. రైతుబంధు జీవితబీమా నామినేషన్ల దారఖాస్తులు వెంటనే ప్రారంభించి 2018 ఆగస్టు 14 వరకు ముగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుండి పనిచేసినా 69 రోజుల సమయంలో సెలవులు మినహాయిస్తే సిబ్బంది పనిచేసేందుకు 45 రోజుల నుండి 50 రోజులు మిగులుతాయి. ఈ యాభై రోజుల్లో ప్రతిఒక్క ఏఈఓ ఐదువేల మంది రైతుల నుండి జీవితబీమా నామినేషన్ల దరఖాస్తులను రాయించి, సేకరించాల్సి ఉంటుంది. అంటే రోజూ సరాసరిన 100 మంది రైతుల నుండి వీటిని సేకరించాల్సి ఉంటుంది.
అనేక పనులు
ఒకవైపు విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ ఈ యాబై రోజుల్లోనే పూర్తి కావాలి. రైతులకు ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందించేందుకు ఇదే సరైన సమయం. వీటితో పాటు సాయిల్ హెల్త్ కార్యక్రమాలు చేపట్టాలి. ఇవన్నీ ఇలా ఉండగా, ఏ ఏ సర్వే నెంబర్లలో ఏ ఏ పంటలు రైతులు వేశారో వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లోని ఏఈఓలు 24 గంటలు కష్టపడ్డా ఈ పనులన్నీ చేయడం దుస్సాధ్యం.
రైతుబంధు జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ఎల్‌ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కి అప్పచెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ప్రతిగ్రామంలో ఒకరు, అంతకు మించి ఎల్‌ఐసీ ఏజంట్లు ఉంటారు. రైతుబంధు జీవితబీమా పథకం కింద నామినేషన్ల దరఖాస్తు స్వీకరించే బాధ్యత ఎల్‌ఐసీ ఏజంట్లకు అప్పచెబితే ఏఈఓలపై పనిభారం తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవితబీమా కనుక ఎల్‌ఐసీ ఏజంట్లే సరిగ్గా పనిచేయగలుగుతారని స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై పరిశీలన చేస్తే సరైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుందని నిపుణలు పేర్కొంటున్నారు.