రాష్ట్రీయం

అదిరేలా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 7: ప్రపంచ దేశాలే అబ్బురపోయేలా రాష్ట్ర రాజధాని అమరావతి నగరాన్ని నిర్ణీత కాలంలో అభివృద్ధి చేసి చూపిస్తామని సింగపూర్ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్పష్టమైన హామీనిచ్చారు. సీడ్ ఏరియా అభివృద్ధి కోసం స్టార్టప్ ఏరియా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలచిన 1691 ఎకరాల్లో తొలిదశలో 646 ఎకరాల అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్ధసారధి, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌లతో రెండు ఎంవోయులపై సంతకాలు చేసిన ఈశ్వరన్ తదుపరి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా నదీ అభిముఖంగా అమరావతి ఉందంటూ ఇక్కడ అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకుంటూ అద్భుత నగరాన్ని నిర్మించుకోవచ్చన్నారు. తాము నేడు కుదుర్చుకున్న రెండు ఎంవోయులు చారిత్రాత్మకమైన మైలురాయి వంటి ఘట్టమన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది ఇక్కడ మకాం వేసి పనులు చేపట్టారని పైగా ఉచితంగా భూములు ఇచ్చిన రైతులను దశలవారీగా సింగపూర్‌కు తీసుకెళ్లి ఇక్కడ వారు ఇచ్చిన భూముల్లో ఏఏ నిర్మాణాలు జరుగబోతున్నాయో వివరించి చెప్పగా వారు ఎంతో ఆనందించారని అన్నారు. అలాగే సింగపూర్ నుంచి 30 మంది విద్యార్థులను ఈ ప్రాంతంలో పర్యటింపచేసి వారి నుంచి సూచనలు, సలహాలు కూడా స్వీకరించామన్నారు. త్వరలో విజయవాడలోనే తమ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని అమరావతిలో పెట్టుబడులు పెట్టేవారందరికీ ఈ కార్యాలయం అందుబాటులో ఉండగలదన్నారు. చంద్రబాబు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధతో సింగపూర్-ఆంధ్రప్రదేశ్‌ల సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో తొలిసారిగా 2014 డిసెంబర్‌లో తమకు అవగాహన కుదిరిందని, దీని ప్రకారం దశలవారీగా స్టార్టప్ ఏరియాలో 1691 ఎకరాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో 15ఏళ్లలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో తమ వాటా 58 శాతంగా ఉందన్నారు. ఇక్కడ ఐటీ, బ్యాంకింగ్ రిటైల్, బిజినెస్, ఎంటర్‌టైనె్మంట్ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కెపాసిటీ బిల్డింగ్, ఎయిర్ కనెక్టివిటీలు ఉంటాయని అన్నారు. నేడు జరిగిన ఒప్పందాలను తాము మనఃపూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఇక పనులను వేగవంతం చేస్తామంటూ అత్యద్భుత ప్రపంచస్థాయి నగరాన్ని ఇక్కడ నిర్మించడానికి నేటి ఎంవోయులు ఎంతగానో దోహదపడగలవన్నారు.