రాష్ట్రీయం

మాట తప్పిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూన్ 7:ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి వెంకన్నపాదాల సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసంచేసి నమ్మకద్రోహానికి పాల్పడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై నిప్పులు చెరిగారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా నవోదయ విద్యాలయ ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడారు. వర్షం పడుతున్నా కదలకుండా వేలాది మంది జనం ఆయన ప్రసంగం విన్నారు. ప్రజల ఆసక్తి చూసి మరింత ఉత్సాహంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గత నాలుగేళ్ళుగా రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విపులంగా వివరించారు. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ నేత జగన్, జనసేన పవన్‌కళ్యాణ్‌లపై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలో సీఎం ముందుగా ఆంధ్రప్రదేశ్‌ను ఒడిఎఫ్‌గా ప్రకటించారు. అదేవిధంగా చండ్రమాకులపల్లెను 11స్టార్స్ గ్రామంగా ప్రకటించారు. రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ అశాస్ర్తియంగా విభజిస్తే, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వెంకన్నసాక్షిగా నమ్మబలికిన ప్రధాని నరేంద్రమోదీ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. వాస్తవానికి బీజేపీతో ఎన్నికలలో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ 20 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయిందన్నారు. మిత్రపక్షంగా తాము ధర్మాన్ని పాటించామని, అయితే మోదీ అధర్మానికి తెరలేపారని అన్నారు. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై పోరాట చేస్తున్నామన్నారు. దేశంలోని 11రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చిన కేంద్రం, ఎపికి ఇచ్చేందుకు బిజెపి హైడ్రామాలు చేస్తోందన్నారు. తాము గొంతెమ్మకోర్కెలు కోరడం లేదని, ప్రత్యేకహోదా కోరుతున్నామని, అయితే ప్రధాని మోదీ నమ్మకద్రోహంపై తిరుగుబాటు చేసి, హోదాకోసం పోరాడుతున్నామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా వద్దా అంటూ..మీరే చెప్పండి అంటూ సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రశ్నిస్తు, కావాలి అంటే మీ చప్పట్లతో ఆమోదం తెలపాలని పిలుపునిచ్చారు. దీంతో సభలో ఉన్న వేలాదిమంది ప్రజలు ఒక్కసారిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ చప్పట్లుకొడుతూ, నినాదాల శబ్ధంతో, హోరున కురుస్తున్న వర్షం శబ్ధం వెలవెలబోయింది. అనంతరం ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తు తాను బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంత కాలం జనసేన నేత పవన్‌కళ్యాణ్ తనను పాలనా దక్షుడని, సమర్థుడని పొడిగారన్నారు. బిజెపితో పొత్తు తెంపుకోవడంతో పొడిగిన నోరే తిడుతూ, అభాండాలు వేస్తోందని పవన్‌కళ్యాణ్‌కు చరకంటించారు. ప్రతి శుక్రవారం కోర్టుబోనెక్కే వైసిపి అధినేత జగన్, బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రభుత్వంతో కలసి కేంద్రంపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేత జగన్, కేసులు నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో చేతులు కలుపుతున్నారన్నారు. ఓవైపు రాష్ట్రానికి మోసం చేసిన కేంద్రం, తిరుమల వెంకన్న ఆలయంపై కూడా కన్నువేసిందన్నారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం వెంకన్నను, ప్రజల నమ్మకాన్ని పావుగా వాడుకోవడానికి కేంద్రం కుటిలయత్నాలకు తెగబడిందన్నారు. అయితే తాను తిరుగబడటంతో వెనక్కు తగ్గిందన్నారు. 2003లో తిరుమల ఘాట్‌లో తనపై నక్సలైట్లు హత్యాయత్నానికి తెగబడ్డారని, ఆనాడు వేంకటేశ్వరస్వామి దయతో బతికి బయటపడ్డానన్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడాటానికి వెంకటేశ్వర స్వామివారు హత్యాయత్నం నుంచి కాపాడి తనకు పునర్జన్మ ఇచ్చారన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి వారితో రాజకీయాలుచేసి బయటపడిన వారు లేరని, ఇప్పటికే అనేక ఉదంతాలు చరిత్రలో ఉన్నాయన్న విషయాన్ని కుటిల రాజకీయాలు చేసేవారు గుర్తించుకోవాలన్నారు.
రాష్ట్రప్రగతి ఆగదు
విభజన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నో ఆర్థికఇబ్బందులు ఎదురైనా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని, కేంద్రం చేయూత ఇవ్వకపోయినా రాష్ట్రప్రగతిని ఎట్టి పరిస్థితులలో ఆగనివ్వబోనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్వేగంగా ఉన్నారు.