ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో 4వేల కోట్లతో గ్రామీణ రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం: ఆంధ్ర ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కోట్ల వ్యయంతో రహదారులు నిర్మిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఆదివారం కుటుంబ సమేతంగా సింహాచలేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రన్నబాట పేరుతో 4 వేల కిలోమీటర్ల రోడ్లు వేయాలని ప్రతిపాదించామన్నారు. కొన్నిచోట్ల సిసి రోడ్ల పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. రోజుకు 4 కిలోమీటర్ల రోడ్డు వేస్తారన్నారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకం ద్వారా ఈ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరవుతున్నాయన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 90 లక్షల మంది మహిళలకు 3,700 కోట్ల రుణాలు అందజేశామన్నారు. భైరవస్వామి సన్నిధికి రహదారి కల్పించే అంశాన్ని అటవీశాఖ అధికారులతో చర్చిస్తానని చెప్పారు.