రాష్ట్రీయం

తీర రక్షణలో రా‘రాణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: భారత తీర రక్షణ దళం అమ్ములపొదిలోకి మరో యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఫాస్ట్ పెట్రోల్ వెసల్ ఐసీసీఎస్ రాణి రష్మోనీ సోమవారం తీర రక్షణ దళంలో చేరింది. కోస్ట్‌గార్డ్ అడిషనల్ డైరక్టర్ జనరల్ వీఎస్‌ఆర్ మూర్తి విశాఖలోని కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నౌకను జాతికి అంకితం చేశారు. 51 మీటర్ల నిడివి కలిగిన ఈ నౌకను విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ నిర్మించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నౌకను రూపొందించారు. ఇందులో ఎంటీయూ 4000 సిరీస్‌కు చెందిన మూడు డీజిల్ ఇంజన్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరక్టర్ జనరల్ మూర్తి మాట్లాడుతూ తీర రక్షణతోపాటు, సముద్ర జలాలపై నిఘాకు ఈ నౌక ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాదు, సముద్ర దొంగలను పసిగట్టడానికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఈ నౌకలో ఉందని ఆయన చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, యుద్ధ నౌకలను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించడం ముదావహమని అన్నారు. దీనివలన మన శక్తి సామర్థ్యాలు కూడా ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం ఉందని అన్నారు. షిప్‌యార్డ్ సీఎండీ శరత్‌బాబు మాట్లాడుతూ యుద్ధ నౌకల తయారీకి భారత నౌకాదళం షిప్‌యార్డును నిరంతరం ప్రోత్సహిస్తోందని అన్నారు. అత్యాధునిక ఈ నౌకను నిర్ణీత సమయంలోనే నిర్మించి ఇవ్వడంతో షిప్‌యార్డ్ కార్మికుల శక్తి సామర్థ్యాలు మరోసారి నిరూపితమయ్యాయని ఆయన అన్నారు.