రాష్ట్రీయం

సీబీఐ విచారణ జరిపించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: తిరుమలలో చోటు చేసుకున్న కొన్ని అపశ్రుతులు, అక్రమాలు, టీటీడీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు, మాజీ సలహాదారు రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఆలయంలోని ‘పోటు’ (స్వామివారి వంటశాల) ను మరమ్మతుల పేరుతో 2007 డిసెంబర్ 8 నుండి 25 రోజుల పాటు మూసివేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ‘మేడం’ ఆదేశాల మేరకే మరమ్మతులు చేస్తున్నట్టు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తనతో చెప్పారన్నారు. ఈ విషయం ఈఓకు కూడా తెలియదని, సీఎం ఆదేశాలవల్ల ఈఓకు మరమ్మతుల విషయం చెప్పలేదన్నారు. ‘మేడం’ ఎవరో తనకు తెలియదని దీక్షితులు పేర్కొన్నారు. మరమ్మతుల సమయంలో పోటులో నేలపై బండలన్నీ తొలిగించారని, అడుగున విలువైన సంపద ఏదైనా ఉందన్న కారణంతో తవ్వారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. దురుద్దేశం లేకపోతే పోటు మరమ్మతులను రహస్యంగా ఎందుకు కొనసాగించారని ప్రశ్నించారు. పోటుకు దగ్గర్లోనే శ్రీవారి గర్భాలయమైన వైకుంఠం (ఆనందనిలయం) ఉందని, గర్భాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోలేదన్నారు. పోటుకు మరమ్మతులు జరిగిన 25 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం సమర్పించలేదని, స్వామివారిని ‘పస్తు’ ఉంచారన్నారు. స్వామివారిని పస్తు ఉంచినందువల్ల ప్రభుత్వం రోజూ వెయ్యికోట్ల రూపాయల చొప్పున 25 వేల కోట్లు స్వామి పాదాల వద్ద ఉంచి, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
2017 లో స్వామి వారి పట్ల తీవ్రమైన అపచారం జరిగిందని రమణ దీక్షితులు ఆరోపించారు. ఆలయంలో పనిచేసే సుందరవదన్ దీక్షితులు, వెంకటాచార్యులు దీక్షితుల బంధువు చనిపోవడం వల్ల వారికి ‘మృతశౌచం’ వచ్చిందని, అయినప్పటికీ వారి చేత పవిత్రోత్సవాలు వారిచేత చేయించారన్నారు. ఇది తీవ్రమైన అపచారమన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి జరిగే బ్రహ్మోత్సవాలను ‘వాణిజ్యం’ చేశారని ఆరోపించారు.
టీటీడీ అర్చకులకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయిందని, వారి సలహాలను, సూచనలను టీటీడీ పాటించడం లేదని దీక్షితులు ఆరోపించారు. టీటీడీకి ఈఓ తదితర కీలకపోస్టుల్లో నియామకం అవుతున్న అధికారులకు వైదిక విధానాలు, తిరుమలలో పాటించే సంప్రదాయాలు, పండగలు, వాటి విశిష్టతలు, సంస్కృతి గురించి అవగాహన ఉండటం లేదన్నారు. సంప్రదాయాలపట్ల వీరికి అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.
1997-98 లో ఆలయం వెలుపల ఉన్న వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించారని, శిల్పకళతో ఉట్టిపడే ఈ మండపాన్ని తొలగించవద్దని తాను సూచించినప్పటికీ, ఆనాటి ఈఓ బాలసుబ్రహ్మణ్యం పట్టించుకోలేదనాన్నారు. ఆర్కియాలజీ వారు వెయ్యికాళ్ల మండపాన్ని జాతీయ సంపదగా గుర్తించారని, ఈ శాఖ అనుమతి లేకుండా మండపాన్ని తొలగించడం విచారకరమన్నారు. ఈ మండపం తవ్వకాల్లో నిధులు, ఆభరణాల భండారాలు బయటపడ్డాయన్న ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. మీరాశీదార్లను, అర్చకులను అనేక విధాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు.
ఆభరణాల సంగతేమిటి?
స్వామి వారి ఆభరణాలు 1996 కు ముందు మీరాశీదార్ల వద్ద ఉండేవని, వీటికి లెక్కాపత్రం ఉండేదని రమణ ధీక్షితులు తెలిపారు. 1996 తర్వాత వీటిని టీటీడీ స్వాధీనం చేసుకున్నదని, వీటి లెక్కలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఈ ఆభరణాలు ఉన్నాయో వెల్లడించాలన్నారు. టీటీడీ వ్యవహారాల గురించి తాను ప్రశ్నిస్తే తనపై వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారని రమణ ధీక్షితులు తెలిపారు. అక్రమాలు, అన్యాయాలపై ప్రశ్నించడం కూడా నేరమా అంటూ నిలదీశారు.