రాష్ట్రీయం

ఓటేస్తే.. ఇక రసీదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ యంత్రం ద్వారా ఓటు వేయగానే ఓటు వేసినట్టు రసీదు అందనుంది. ఓటరు కోరుకున్న పార్టీకే ఓటు నమోదైందో లేదో కూడా అక్కడే కనిపించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ విధానాన్ని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అమలు చేయనున్నారు. ఓటు వేయగానే ఓటరుకు రసీదు అందుతుంది. 2014 ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా ఎనిమిది పార్లమెంటు నియోజక వర్గాల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. అమలు చేసిన నియోజకవర్గాల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ సెగ్మెంట్ ఒకటి. ఇప్పుడు తెలంగాణలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారి అమలు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసినవారికి ఇవిఎంకు అమర్చిన ప్రింటర్ ద్వారా రసీదు అందుతుంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ (సభ్యుల ఎన్నిక, ఎన్నిల వ్యయం, ఎన్నికల పిటిషన్) రూల్స్ 2005లో ఈమేరకు సవరణ చేస్తూ మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 35 పోలింగ్ స్టేషన్లలో ఇవిఎంలకు ప్రింటర్లు అమర్చుతారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుమానాలకు అధారాలు లేవని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోయిన వారు ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం, ఇవిఎంల వల్లే ఓడిపోయామని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం మున్సిపాలిటీలో ప్రయోగాత్మకంగా 35 పోలింగ్ స్టేషన్లలో ఇవిఎంలకు ప్రింటర్లను అమర్చుతున్నారు.
1999లో దేశంలో ప్రయోగాత్మకంగా కొన్ని నియోజక వర్గాల్లో ఇవిఎంలను ప్రవేశపెట్టారు. 2004లో దేశవ్యాప్తంగా ఇవిఎంలను ప్రవేశపెట్టారు. ఇవిఎంలను ట్యాంపర్ చేస్తున్నారని కొన్ని రాజకీయ పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఈ సందర్భంగా ఇవిఎంల ద్వారా ఓటు వేసిన వారికి రసీదిచ్చేలా ఇవిఎంలను ఆధునీకరించినట్టు ఎలక్షన్ కమిషన్ 2013లో సుప్రీంకోర్టుకు తెలిపింది. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది లోక్‌సభ నియోజక వర్గాల్లో ఓటర్లకు రసీదిచ్చే విధానం అమలు చేసింది. ఈ విధానంలో ఓటురు ఏ పార్టీకి ఓటు వేశాడో రసీదులో కనిపించని పక్షంలో ఓటరు పోలింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఎన్నికల అధికారులు విచారణ జరుపుతారు. ఒకవేళ ఓటరే తప్పుడు ఫిర్యాదు చేసినట్టు తేలితే చట్ట ప్రకారం అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది.