రాష్ట్రీయం

9న ఆలయాల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాలను ఈ నెల 8న రాత్రి మూసివేసి, తొమ్మిదో తేదీ మధ్యాహ్నం సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరవాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)తో పాటు విజయవాడ కనకదుర్గ, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం, సింహాచలం అప్పన్న దేవస్థానం, కాణిపాకం గణేశ్ దేవాలయం, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం, వేములవాడ, బాసర, ద్వారకా తిరుమల, మంగళగిరి తదితర ప్రముఖ దేవాలయాలన్నింటినీ సూర్యగ్రహణ సమయంలో మూసివేస్తున్నట్టు ఆయా ఆలయాల పూజారులు ప్రకటించారు. విజయవాడ కనకదుర్గ ఆలయం అర్చకుడు కృష్ణ మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఎనిమిదో తేదీ రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని, గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ పూర్తయ్యాక తొమ్మిదో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తెరుస్తామని వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దేవాలయాల్లో కూడా దాదాపు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు.
వాస్తవంగా సూర్యగ్రహణ సమయం మార్చి 9వ తేదీ తెల్లవారుజామున 4.49 గంటల నుండి ఉదయం 10.05 గంటల వరకు ఉంటుందని ఎర్త్‌సైనె్సస్ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పంచాంగాల్లో కూడా ఇదే విషయాన్ని తెలియచేశారు. సూర్యగ్రహణ ప్రారంభం ఇండోనేషియాలో కనిపిస్తుంది. అలాగే చివరగా ఉత్తర పసిఫిక్ సముద్రంతో అంతమవుతుంది. ఇండోనేషియా, మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలు, మలేషియా, ఫిలిప్పీన్స్ తదితర ప్రాంతాల్లో సగానికన్నా ఎక్కువగా గ్రహణం కనపడుతుంది. కంబోడియా, మయన్మార్, వియత్నాం, థాయిలాండ్ తదితర దేశాల్లో 50 శాతం గ్రహణం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, చైనా, జపాన్ తదితర దేశాల్లో సగానికన్నా తక్కువగా గ్రహణం కనపడుతుంది.
చాలాకాలం తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుండటంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, భారతదేశంలో పాక్షికంగానే గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో సూర్యగ్రహణ సమయం ఉదయం 6.29 గంటల నుండి 6.47 గంటల వరకు ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్ప మార్పులతో ఇవే సమయాల్లో గ్రహణం సంభవిస్తుంది.
భారత్‌లో కొన్ని నగరాల్లో సూర్యగ్రహణం సమయాలు ఇలా ఉంటాయి.
హైదరాబాద్ 06.29-06.47
ఢిల్లీ 06.38-06.44
చెన్నయ్ 06.21-06.47
వారణాశి 06.13-06.47
కోల్‌కతా 05.51-06.05
మళ్లీ 2017లో
ప్రస్తుతం వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణం తర్వాత 2017 ఆగస్టు 21న మళ్లీ సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.