రాష్ట్రీయం

రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఒకేసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సుమారు ఐదురోజుల తేడాతో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు నిలిచిపోతాయి. 5న మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగంతో ఏపి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాజ్‌భవన్ నుంచి గవర్నర్ కాన్వాయ్ బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎన్నింటికి బయలుదేరితే సరిగ్గా సమయానికి కాన్వాయ్ అసెంబ్లీ ఆవరణలోకి చేరుకుంటుందన్న అంచనా కోసం మంగళవారం కాన్వాయ్ సిబ్బంది, పోలీసు పైలట్, ఎస్కార్ట్ వాహనాలతో రిహార్సల్ చేశారు. రాజ్‌భవన్ నుంచి బయలుదేరిన గవర్నర్ కాన్వాయ్ ఆరు నిమిషాల్లో అసెంబ్లీకి చేరుకుంటుంది. 5వ తేదీ శనివారం కావడం వల్ల గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. 7 నుంచి మూడు రోజుల పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి, ఆమోదిస్తారు. ఆ తర్వాత 10న ఏపి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ ఆమోదం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016-17) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
అదే రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ
ఇలాఉండగా అదే రోజు (10న) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఒకవైపు ఏపి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రాతిపాదించడం, అదే రోజున తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్ అసెంబ్లీకి చేరుకుంటారు. దీంతో ఆ రోజున అసెంబ్లీ ప్రాంగణం కిటకిటలాడనుంది. ఏపి అసెంబ్లీ సమావేశాలను తొలుత విజయవాడలో నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం భావించింది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదేమోనని భావించి, చివరకు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు వేర్వేరు అసెంబ్లీ భవనాలు ఉన్నా ఆవరణ చాలా చిన్నదిగా ఉండడం సమస్యగా మారింది. దీంతో భారీ కాన్వాయ్‌లు, ఎమ్మెల్యేల వాహనాలతో క్రిక్కిరిసిపోనుంది. ఇది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారనున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు అక్కడినుంచే పోలీసులు రానున్నారు. ఆంధ్ర పోలీసులతోనే భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా లోగడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర డిజిపిని ఆదేశించిన విషయం విదితమే.