రాష్ట్రీయం

కుటుంబం కంటే పార్టీయే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రభుత్వానికి, పార్టీకి నాయకులే సంధాన కర్తలని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందే ప్రగతి ఫలితాలపై పర్యవేక్షణ బాధ్యత నాయకులదే అన్న విషయాన్ని ఏ ఒక్కరూ మరువరాదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమంటూ వలసలను ప్రోత్సహించటాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సేవ చేసేందుకు రాజకీయాల కతీతంగా వలసలు వస్తున్నవారితో కలిసి పనిచేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా వుండాలంటూ పిలుపునిచ్చారు. పంతాలు, పట్టింపులు పక్కనబెట్టి చిన్న చిన్న సమస్యలు, అంతర్గత విభేదాలుంటే ఎక్కడికక్కడ పరిష్కరించుకుంటూ సమన్వయంగా ముందుకు వెళతాం... కష్టపడి పనిచేద్దాం... పేరు ప్రతిష్ఠ కలిసి పంచుకుందామంటూ చెప్పారు. స్థానిక ఎ కనె్వన్షన్ హాలులో మంగళవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు గంటన్నర పైగా అధ్యక్షతోపన్యాసం చేసారు. ఎన్నికల హామీలను మనం నిలబెట్టుకోవాల్సి వుందన్నారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకుల్లో ఎందరో పార్టీని వీడి బైటకు వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరు మన పార్టీలోకి వచ్చారు. పాత, కొత్త మేలుకలయిక ద్వారా ఘన విజయం సాధించగలిగామంటూ చెప్పారు. ‘నాది సుదీర్ఘ రాజకీయ జీవితం... కుప్పంలో ఓటమి లేకుండా వరుసగా గెలుస్తూ రావటమే కాదు ఆరు నెలలకోసారి వెళుతూ ఎన్నికల సమయంలో అటువైపు కనె్నత్తి చూడకపోయినప్పటికీ 50వేల మెజార్టీతో గెలుస్తూ వస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గాలను కుప్పంలా మలచుకోవాలి’ అన్నారు. తనకు కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యమన్నారు. నేతలు, కార్యకర్తలు నిరంతరం అప్‌డేట్ కావాలి. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు.
ఇటీవలే తెలుగుదేశంలో చేరిన వైకాపా శాసనసభ్యులు జలీల్‌ఖాన్, భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి తదితరులు సమావేశం ఆరంభానికి ముందుగానే ప్రాంగణానికి విచ్చేసి పలువుర్ని ఆలింగనం చేసుకుంటూ పలకరించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. పలు జిల్లాలకు చెందిన నేతలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బొడ్డు భాస్కరరామారావు కుమారుడు వెంకటరమణలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. వెంకటరమణ గత ఎన్నికల్లో వైకాపా తరఫున రాజమండ్రి లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు.

పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు
కార్యకర్తల సంక్షేమానికి రూ. 6.79 కోట్లు: లోకేశ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 1: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పాటుపడుతున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయకర్త నారా లోకేష్ అన్నారు. మంగళవారం నాడిక్కడ జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో లోకేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన నాలుగు శిక్షణా శిబిరాల్లో 7,474 మందికి శిక్షణ ఇచ్చామని ఈ శిక్షణా శిబిరాలపైనే రాబోయే ఐదేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 20 లక్షలు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాబోయే మహానాడు లోపు 32 వేల మంది గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యం నెరవేరేలా ఇన్‌ఛార్జీల సహకారం అందించాలన్నారు. శిక్షణ పొందిన కార్యకర్తల పిల్లల చదువు, వైద్యం, ఉపాధి ఇతర అవసరాల నిమిత్తం 6.79 కోట్లు ఖర్చు చేశామన్నారు. 54 లక్షల మంది కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.