ఆంధ్రప్రదేశ్‌

ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో మాల్ ప్రాక్టీస్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 1: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు, అనంతరం 21 వరకూ ఒకేషనల్ గ్రూపులకు పరీక్షలు జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9,93,891 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,00,419 మంది, రెండో సంవత్సరం 4,93,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 117 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వీటితో పాటు 55 సెల్ఫ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ జరక్కుండా చూసేందుకు 80 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 60 సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, వీటితో పాటు జిల్లా స్థాయిలో ఆర్‌ఐఓ, డివిఇఓలతో కూడిన కమిటీ ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిముషాల ముందుగానే చేరుకోవాలని, ఒక్క నిముషం ఆలస్యాన్ని కూడా అంగీకరించేది లేదన్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశామన్నారు. ఎపిలో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం:0866- 2374130 నెంబర్‌తోను, తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం: 040-24603317 నెంబర్‌తోను పనిచేస్తాయన్నారు. పరీక్షల అనంతరం ఇంటర్ పేపర్ల మూల్యాంకనం ప్రారంభిస్తామని మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలో 13 కేంద్రాల్లో ఇంటర్ మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం సిసి కెమెరాల ద్వారా రికార్డు చేస్తామన్నారు. అలాగే మూల్యాంకన ప్రక్రియను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉందన్నారు.