రాష్ట్రీయం

అతీగతీ లేని స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలును రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు తేలిగ్గా తీసుకున్నాయి. అన్ని విశ్వవిద్యాలయాల్లో 29వ తేదీలోగా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞలను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించినా అధికార గణం పట్టించుకోలేదు. యుజిసి ఆదేశాలను కూడా గాలికి వదిలేశాయి. తెలంగాణలో 19 యూనివర్శిటీలు, ఆంధ్రాలో 26 యూనివర్శిటీలు ఉన్నాయి. యూనివర్శిటీల్లో స్వచ్ఛ భారత్ అంటే కేవలం నలుగురు కూర్చుని ప్రతిజ్ఞ చేసి మమ అనిపించే రకంగా కాకుండా యూనివర్శిటీ క్యాంపస్‌లను సంపూర్ణంగా పరిశుభ్రం చేయడం అంతర్గత లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో కొద్దిమందితో నిర్వహించి అయిందనిపించారు. వేలాదిమంది విద్యార్థులు, సిబ్బంది ఉన్న వర్శిటీల్లో కూడా కేవలం రిజిస్ట్రార్ కార్యాలయాలకే ఈ ప్రతిజ్ఞ పరిమితమైంది. ఆంధ్రాలో 10 సంప్రదాయ వర్శిటీలు, స్విమ్స్‌తో కలిపి 11 స్పెషాలిటీ వర్శిటీలు, ఐదు డీమ్డ్ వర్శిటీలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు ఈ ఏడాది ఐఐఎం, ఎన్‌ఐటి కూడా ఆంధ్రాలో మొదలయ్యాయి. అలాగే తెలంగాణలో ఐదు సంప్రదాయ వర్శిటీలు, ఏడు స్పెషలైజ్డ్ యూనివర్శిటీలు, మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రెండు డీమ్డ్ వర్శిటీలు, రెండు జాతీయ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇన్ని విద్యాసంస్థలకూ అనుబంధంగా వందలాది ప్రైవేటు అన్ ఎయిడెడ్ డిగ్రీ, పిజి , డిఇడి, బిఇడి, ఎంబిఎ, ఎంసిఎ, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలు పనిచేస్తున్నాయి. సామాజిక పరివర్తనకు అంబాసిడర్‌గా భావిస్తున్న ఉన్నత విద్యాసంస్థలే ఇలా ఉంటే ఇక సమాజం పరిస్థితి ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, గాంధీ జయంతి, బాలల దినోత్సవం, అవతరణ దినోత్సవాలను ఏదో గాలివాటంగా నిర్వహిస్తున్న వర్శిటీలు అదే కోవలో స్వచ్ఛ్భారత్‌ను సైతం వదిలేశాయి.
3న మాతృభాషా దినోత్సవం
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో 3వ తేదీన మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలని యుజిసి కార్యదర్శి జస్పాల్ సాంధూ ఆదేశించారు. స్వచ్ఛ భారత్ వంటి జాతీయ కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకున్న వర్శిటీలు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటాయో చూడాల్సి ఉందని విద్యార్థులు చెబుతున్నారు.