రాష్ట్రీయం

‘ఒక్క నిమిషం’ నిబంధనతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఒక్క నిమిషం ఆలస్యమయిందనే కారణంగా అధికారులు అడ్డుకోవడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రొద్దుటూరు, కొత్తవలస తదితర పట్టణాల్లోని కాలేజీల్లో ఫీజులు చెల్లించలేదని హాల్‌టిక్కెట్లు జారీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నెట్‌లో హాల్‌టిక్కెట్లు ఉంచినా, వాటిపై సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం చేయాలనే నిబంధనతో నెట్‌లో హాల్‌టిక్కెట్లకు విలువ లేకుండా పోయింది. కేవలం సమాచారం తెలుసుకునేందుకే పరిమితమైంది. తెలంగాణలో తొలి రోజు 4,43,254 మంది జనరల్ అభ్యర్థులు, 39,412 మంది ఒకేషనల్ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 94.51 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. 26,518 మంది గైర్హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక పరిశీలకులను నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పంపించింది. ఎలాంటి ఘటనలు జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు పరీక్షకు 5,12,759 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 4,96,268 మంది హాజరయ్యారు. 16,491 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక పరిశీలకులను కృష్ణా జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలకు పంపించినట్టు అధికారులు వివరించారు.
గాయపడిన అమ్మాయికి స్క్రైబ్
హైదరాబాద్ న్యూ ఎరా కాలేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాలికకు చివరి నిమిషంలో స్క్రైబ్‌ను ఇచ్చి పరీక్ష రాయించారు. దాంతో ఆ అమ్మాయి సంతోషంగా పరీక్షను ముగించింది.